స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవి. జగన్ స్క్రిప్ట్ ఇచ్చి లండన్‌కు వెళ్లారన్నారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసేటప్పుడు కనీస నియమనిబంధాలను పాటించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసులో ముందు ఉన్నవారు కాకుండా ఏ 37గా ఉన్న చంద్రబాబును అరెస్టు చేయడం ఏంటని నిలదీశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుపై అనేక కేసులు పెట్టి నిరూపించలేకపోయారన్నారు. ప్రజాస్వామ్యంలో కారణం చెప్పి అరెస్టు చేస్తారా… కారణం చెప్పకుండా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హుందాగా తను తప్పు చేస్తే నడిరోడ్డుపై శిక్షించాలని అన్నారన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే ప్లాన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులను అరెస్టు చేశారని ఎమ్మెల్సీ చిరంజీవి తెలిపారు.