- Advertisement -
ఏపీ కాంగ్రెస్ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి అయిన షర్మిల సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో బహిరంగ సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనకు జగన్ పాలనకి పొంతనే లేదని చెప్పారు. భూతద్దం పెట్టి చూసినా వైయస్ పాలన అనే వాళ్ళు కూడా కనపడలేదని జగన్ వైఎస్ఆర్ వారసుడు కానే కాదు అని వైయస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు సీఎం జగన్ పాలనలో హత్య రాజకీయాలు నడుస్తున్నాయి.
సొంత బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుకున్నారని అన్ని ఆధారాలు ఉన్న అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని చెప్పారు షర్మిల. ఈ సమావేశంలో సునీత రెడ్డి మాట్లాడుతూ ఆడది అంటే ఒక నారిశక్తి మమ్మల్ని అలానే పెంచారు తప్పు అంటే తప్పు అని చెప్పే మనసు మాది అని అన్నారు.
- Advertisement -