Friday, February 7, 2025

జగన్‌మోహన్‌రెడ్డికు క్రెడిబులిటీ లేదు

- Advertisement -

జగన్‌మోహన్‌రెడ్డికు క్రెడిబులిటీ లేదు

Jagan Mohan Reddy has no credibility

*క్రెడిబిలిటీ లేని నాయకులు, హిడెన్ ఏజెండాతో మాట్లాడతారు
*జగన్ ఎప్పుడు ఏం చేస్తారనేది అతనికే తెలియదని ఎద్దేవా
*వాటర్ సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం
* ‘‘ఎన్టీఆర్ నీళ్ల విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించారు
*జలహారతి ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్..
*గోదావరిలో 10శాతం మాత్రమే వినియోగం..
*సచివాలయంలో సాగునీటి ప్రాజెక్ట్‌లపై సీఎం చంద్రబాబు పవర్ ప్రజెంటెషన్
అమరావతి డిసెంబర్ 30
సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికు క్రెడిబులిటీ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఐదేళ్లలో ఏం జరిగింది…ఇప్పుడు ఏం జరిగింది అని ప్రజలు చూస్తున్నారన్నారు. జగన్ ఎప్పుడు ఏం చేస్తారనేది అతనికే తెలియదని ఎద్దేవా చేశారు. క్రెడిబిలిటీ లేని నాయకులు, హిడెన్ ఏజెండాతో మాట్లాడతారని సెటైర్లు గుప్పించారు. వాస్తవాలు లేకుండా జగన్ మాట్లాడతారని మండిపడ్డారు.అబద్ధాలతో రాజకీయం చేశారని.. ఇప్పుడు అలాకాదని అన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఏపీ సచివాలయంలో సాగునీటి ప్రాజెక్ట్‌లపై సీఎం చంద్రబాబు పవర్ ప్రజెంటెషన్ ఇచ్చారు. మీడియా, ఫైనాన్స్, వ్యవస్థలు, వ్యక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వాటర్ సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు గంగా ప్రాజెక్టు చేపట్టిన తర్వాత ఇందిరా గాంధీ సమక్షంలో అగ్రిమెంట్ జరిగిందని గుర్తుచేశారు. గండికోట, సోమశిల విస్తరణ, కండలేరు వంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 7 మండలాలు తెలంగాణలో ఉన్న వాటిని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చెప్పి వాటిని ఏపీలో విలీనం చేశామని గుర్తుచేశారు. దీనికోసం రాష్ట్రపతితో సంతకం చేశాక పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

‘‘ఎన్టీఆర్ నీళ్ల విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించారు. వెలుగొండను నేనే ప్రారంభించి పూర్తిచేశా. అనంతపురం తలసరి ఆదాయంలో ముందు వరుసకు వచ్చింది. రాయలసీమకు నీరు వస్తే డెల్టాతో పోటీపడుతుంది. కృష్ణానదిలో పై నుంచి నీరురావడం లేదు, పట్టిసీమ వచ్చాక సరైన సమయంలో పంట వేయగలుగుతున్నాం. గోదావరి, కృష్ణాలో నీళ్లుతగ్గినా గోదావరిలో నీరు వస్తోంది. రాష్ట్రంలో కరవును సమర్ధంగా ఎదుర్కొంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు. 2 టీఎంసీల నీటిని బనకచర్లకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటాం. ఓవరాల్‌గా చూస్తే 50 ఏళ్ల సరాసరిలో 3000 టీఎంసీలు గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఈసారి నీళ్లు రిజర్వాయర్‌లకు పంపాం. ఈరోజు టోటల్ రిజర్వాయర్ కెపాసిటీతో ఉంది. సమర్ధంగా నదులు అనుసంధానం చేసి రిజర్వాయర్‌లు కట్టుకుంటే నీటి సమస్య పరిష్కారమవుతుంది. ఏపీకి కరవు, తుఫాను వల్ల ఇబ్బందులు ఉన్నాయి. వంశధార-నాగావళి-గోదావరి-కృష్ణ వరకూ కలిపే అవకాశం ఉంటుంది. తుంగభద్ర- శ్రీశైలం – నాగార్జునసాగర్ – ప్రకాశం బ్యారేజి, చింతలపూడి లిప్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్జున సాగర్ లెప్ట్ మెయిన్ కెనాల్ పూర్తి అవుతుంది’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

జలహారతి ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్..

‘‘తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు రూపకల్పన చేశాం. విజన్ 2047 డాక్యుమెంట్‌లో బాగంగా వాటర్ ప్రాజెక్టు ప్రొవిజన్ ఉంచాం. ఇది దాదాపు ప్రస్తుతానికి రూ.80.112 కోట్లు వ్యయం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రానికి గేమ్ చేంజర్ లాంటిది. రాష్ట్రానికి సాగునీరు…తాగునీరు..రాయలసీమ ప్రాంతాలకు పరిశ్రమలకు నీరు అందుతుంది. పవర్ పాయింట్ ద్వారా ప్రాజెక్ట్ గురించి సీఎం చంద్రబాబు వివరించారు. బావి తరాల కోసం ఈ ప్రాజెక్ట్ రూప కల్పన చేశాం. 5 కోట్ల ప్రజలు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలి. బనకచర్ల రాయల సీమకు గేట్ వే అవుతుంది… అక్కడి నుంచి అన్ని ప్రాంతాలు కనెక్టు చేయొచ్చు. ప్రతి ఐదేళ్లకు 40శాతం కాస్ట్ ఈ ప్రాజెక్టుకు ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిచేస్తే అనుకున్న ఆదాయం వస్తుంది ఆలస్యం అయితే ఖర్చు పెరుగుతుంది. ఈప్రాజెక్టులో లిఫ్ట్‌లు, టన్నల్, గ్రావీటీ ద్వారా నీటిని తరలిస్తాం. 3 టీఎంసీల నీటిని పోలవరం నుంచి తీసుకుని 1 టీఎంసీల వాడి రెండు టీఎంసీలు రాయలసీమకు పుష్‌ చేస్తాం. ఈ ప్రాజెక్టు చేయగలిగితే ఇండియాలోనే గొప్ప ఇరిగేషన్ ఇన్‌ఫ్రాస్టచ్చర్ వస్తుంది. రాయలసీమతో పాటు అన్నిప్రాంతాలు అభివృద్ధి జరుగుతుంది’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

గోదావరిలో 10శాతం మాత్రమే వినియోగం..

‘‘సముద్రంలో కలిసే మొత్తం గోదావరిలో 10శాతం నీటిని మాత్రమే తీసుకుంటున్నాం. ఇది చరిత్ర తిరగ రాయబోయే ప్రాజెక్టు అందుకే దీనికి తెలుగుతల్లికి జలహరతి అన్నాం. ఇదిచేయడం ద్వారా రాబోయే తరాలకు నీటి సమస్య లేకుండా చేయొచ్చు. ఆర్థిక మంత్రిను కూడా కలిసి ఇంట్రా లింకింగ్ అని చెప్పాము వారు వర్కవుట్ చేస్తామన్నారు. హైబ్రిడ్ మాడల్‌లో పెట్టుకోవాలి… కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు నుంచి కూడా భాగస్వామ్యం చేస్తే మంచింది. ఈ ప్రాజెక్టును డబ్బులు ఉంటే మూడేళ్లలో పూర్తిచేయొచ్చు. ఇప్పుడు 50శాతం లిస్ట్ ఇరిగేషన్లు పనిచేయడం లేదు. రాజస్ధాన్‌లో ప్రైవేటు మాడల్‌లో ఇలాంటి ప్రాజెక్టులు చేశారు. నిర్మాణం వాళ్లే చేస్తారు.. ప్రాజెక్టు మన పరిధిలో ఉంటుంది..వారికి డబ్బు చెల్లిస్తాం. దీనిలో కన్సూమర్‌పై ఎలాంటి భారం వేయం. అంతిమంగా నీటిని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూస్తున్నాం. నాలుగు వేల మెగావాట్లు మనం వాడితే పంప్ ఎనర్జీ ద్వారా పీక్ టైంలో విద్యుత్ వస్తుంది. విద్యుత్ విషయంలో యూనిట్ కాస్టును తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు ఎన్సీఎల్టీకి వెళ్లింది. దేశంలో ఒక్క రాజస్ధాన్‌లో మాత్రమే రూ.25వేల కోట్లతో ఇంట్రాలింకింగ్ చేశారు. దేశంలో ఇంత లార్జ్ స్కేల్‌లో ఇంట్రాలింకింగ్ ఎక్కడా లేదు.ఇండియాలోనే రైతులకు అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రం ఏపీ. తెలుగు తల్లికి జలహరతి నా జీవితాశయం దాన్ని పూర్తిచేసి రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్