Saturday, February 15, 2025

బడ్జెట్ సెషన్ కు జగన్

- Advertisement -

బడ్జెట్ సెషన్ కు జగన్

Jagan to budget session

విజయవాడ, జనవరి 31, (వాయిస్ టుడే)
అధికారం వేరు. అపోజిషన్‌ రోల్ వేరు. పవర్‌లో ఉన్నప్పుడు ఆదేశాలు ఇస్తే అంతా అధికారులు చూసుకుంటారు. అపోజిషన్‌లోకి వచ్చే సరికి సీన్‌ మారిపోతుంది. అధికారులు ప్రతిపక్ష పార్టీని పట్టించుకోరు. పార్టీ నేతలు సైలెంట్‌ అయిపోతారు. అలాంటప్పుడే అధినేత అన్నింటికి ముందుండి పోరాడాలి. క్యాడర్, లీడర్లలో ధైర్యం కల్పించాలి.అప్పుడే ప్రజా సమస్యలపై పోరాడేందుకు, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ప్రజలు, పార్టీ నేతలు అందరూ కలసి వస్తారు. ఇప్పటి దాకా ఇలాంటి వ్యూహం రచించడంలో ఫెయిల్ అయిన జగన్..ఇప్పుడు అలాంటి మాస్టర్‌ ప్లానే వేస్తున్నారట. గతంలో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని భావించిన జగన్‌..ఇప్పుడు రూటు మార్చినట్లు చెబుతున్నారు.ఏపీలో కూటమి సర్కార్ పవర్‌లోకి వచ్చి ఏడు నెలలు గడిచిపోతుంది. ఇప్పటికే మూడు విడతలుగా సమావేశం అయింది. తొలిసారి సమావేశాలు జరిగినపుడు సభ్యులు అంతా ప్రమాణం చేశారు. దానికి జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.తర్వాత పది రోజుల పాటు జరిగిన కీలక అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఆయన హాజరు కాలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదనే శాసనసభా సమావేశాలకు వెళ్లడం లేదంటూ చెప్పుకొచ్చారు జగన్. ప్రెస్‌మీట్ల ద్వారానే ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతామంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వ్యూహం మారిందంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌కు హాజరవడమే బెటర్‌ అనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.ఫిబ్రవరి మూడోవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సేమ్‌టైమ్‌ ఈ మధ్యే వైసీపీకి కీలక నేతలు గుడ్‌బై చెప్పేశారు. విజయసాయిరెడ్డి లాంటి నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా..బడ్జెట్ సెషన్‌కు హాజరు కావాలని జగన్ భావిస్తున్నారటగతంలో వైసీపీ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానప్పుడు ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవడం రాజీనామాలు చేయవచ్చు కదా అని కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు విమర్శించాయి. ఒక విధంగా చూస్తే అసెంబ్లీకి వెళ్ళకుండా ఉండిపోవడంతో వైసీపీకి మైనస్ అయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిపక్షానికి ప్రధాన పోరాట క్షేత్రమే అసెంబ్లీ అన్నట్లుగా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చుకునే వైసీపీ ప్రభుత్వం మీద పోరు ప్రకటించి..బంపర్‌ విక్టరీ కొట్టారు సీఎం చంద్రబాబు.ఇలాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధినాయకత్వం బడ్జెట్ సెషన్‌కు అటెండ్‌ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తుందట. ఒకవేళ ప్రభుత్వం తీరును నచ్చక వాకౌట్‌ చేసినా..లేక నిరసన తెలిపితే మార్షల్స్‌ ఎత్తికెళ్లినా..మీడియా కవరేజ్‌ వస్తుందని..ఇదంతా పబ్లిక్‌లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ప్రెస్‌మీట్ల ద్వారా తమ వాయిస్‌ బలంగా ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట. అందుకే అసెంబ్లీకి వెళ్లాలా.? వద్దా అని దానిపై పార్టీ ముఖ్యులతో మాట్లాడి డిసైడ్ కానున్నట్లు తెలుస్తోంది.ఇక బడ్జెట్ సెషన్‌కు హాజరుపై జగన్ నిర్ణయం మార్చుకోవడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. దాంతో ఏయే రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయన్నది స్పష్టం చేయనున్నారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ మీద కూడా బడ్జెట్‌లో ప్రస్తావన ఉంటుందా లేదా అన్నది కూడా చర్చగా ఉంది.వీటిన్నింటిపై కూడా అసెంబ్లీ వేదికగానే జగన్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అంటున్నారు. అంతేకాదు గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని పదే పదే ఆరోపిస్తున్న వాటికి కూడా ఆయన అసెంబ్లీలో జవాబు చెబుతారనే వాదన కూడా వినిపిస్తుంది. వైసీపీ బడ్జెట్ సెషన్‌కు హాజరైతే మాత్రం ఈసారి హాట్ హాట్‌గానే సభ జరిగే అవకాశం ఉంది.ఫిబ్రవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై భారీ ఆందోళనకు సిద్ధమైంది వైసీపీ. అదే రోజు జగన్ లండన్ నుంచి ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఆందోళనను వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న పార్టీ ముఖ్యులతో జగన్ ప్రత్యేక సమావేశం కానున్నారు. ఆ మీటింగ్‌లో అసెంబ్లీ సెషన్‌కు హాజరుపై డెసిషన్‌ తీసుకుంటారని తెలుస్తోంది. శాసనసభ సభా సమావేశాల్లో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోతే..లేక ప్రభుత్వం తాము అడిగిన సబ్జెక్ట్‌ మీద చర్చకు సిద్దపడకపోతే సెషన్‌ నుంచి వాకౌట్‌ చేసి..జిల్లాల పర్యటనలకు సిద్ధపడితే ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ వస్తుందని అంచనా వేస్తున్నారట.అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్‌మీట్లకే పరిమితమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పెద్దగా ప్రయోజనం ఉండటం లేదన్న భావనలో వైసీపీ ఉందట. ఇప్పటికే శాసనమండలికి ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా బొత్స అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ కూడా తనతో పాటు పదకొండు మంది ఎమ్మెల్యేలతో బడ్జెట్‌ సెషన్‌కు హాజరవడమే బెటర్‌ అనే ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.వైసీపీ ఓడాక జరిగే తొలి బడ్జెట్ సెషన్‌లో ఆ పార్టీ ఏ విధమైన అంశాలను లేవనెత్తబోతుంది? కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటుంది.? కూటమి ఎమ్మెల్యేలను నిలువరించి జగన్ ప్రభుత్వాన్ని క్వశ్చన్‌ చేయగలరా.? అనేవి ఆసక్తి రేపుతున్నాయి. జగన్‌ అసెంబ్లీకి వస్తారా లేదా.? జిల్లాల పర్యటనలు, ఆందోళనలతో జనాల్లోకి వెళ్తారా.? అనేది వేచి చూడాలి మరి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్