- Advertisement -
అమృత్ ధార పేరుతో ఏపీలో జల్ జీవన్ మిషన్
Jal Jeevan Mission in AP named Amrit Dhara
పవన్ కళ్యాణ్
విజయవాడ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ అమలు పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను లెమన్ ట్రీ హోటల్ లో బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవరెడ్డి, ఈఎన్సీసీ వేంకటేశ్వరరావు తదితరులు పాల్గోన్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి త్రాగు నీరు అందిస్తాం. కుళాయి ద్వారా నాణ్యమైన మంచి నీరు అందించాలన్నదే ఈ పధకం లక్ష్యం. 2019 ఆగష్టు లో ఈ పథకం ప్రారంభమైనా బోర్ వెల్స్ ద్వారా నీటిని అందించడానికే పరిమితమయ్యింది. ఒక మనిషికి 55 లీటర్లు నీటిని ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామని అన్నారు.
నీటి సరఫరా లో వచ్చే ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చూస్తున్నాం. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ను అమృత ధార పేరు తో అమలు చేస్తాం. జెల్ జీవన్ మిషన్ లో లోపాలు, ఇబ్బందులు సరిచేసి త్రాగు నీటిని అందిస్తాం. నీరు దొరకని సమయాల్లో మనకు నీటి విలువ తెలుస్తుంది. పని చేసే సమయం లో ఆచరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది . నేను పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా రివ్యూ చేస్తే ఇందులో అనేక లోపాలు తెలిశాయి. ఈ పధకం అమలుకు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా లక్ష కోట్ల నుంచి 30 వేల కోట్ల వరకు అడిగారు. 2019 లో చిన్న రాష్ట్రం కేరళ రూ. 46 వేల కోట్లు అడిగితే.. గత ప్రభుత్వం మన ఏపి లో మాత్రం రూ. 26 వేల కోట్లే అడిగింది. మన రాష్ట్ర వాటా కూడా గత ప్రభుత్వం ఇవ్వక పోవడం వల్ల జల జీవన్ మిషన్ అమలు కాలేదు. నేను కేంద్ర పెద్దలతో, మంత్రి సీ ఆర్ పాటిల్ తో మాట్లాడితే వారు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి చెప్పారు. నాలుగు వేల కోట్లను సద్వినియోగం చేయలేక పోయారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పని చేశారు. రిజర్వాయర్ ల ద్వారా నీటిని తీసుకోవాల్సి ఉండగా.. వాటి పై దృష్టి పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో నీటి సరఫరా పై దృష్టి పెట్టామని అన్నారు.
- Advertisement -