జనసేన అభ్యర్థులను అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలి

- Advertisement -

జనసేన అభ్యర్థులను అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం

నెల్లూరు

రానున్న ఎన్నికలలో జనసేన అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం పేర్కొంది. నెల్లూరు నగరంలోని స్థానిక రాయల్ పార్క్ హోటల్ లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభిమాన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో రాష్ట్రానికి నూతన పరిపాలన అందించే దిశగా జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో వైకాపాను ఎదుర్కొనేందుకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తోందన్నారు. ఈ క్రమంలో జనసేన అభ్యర్థులుగా ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నప్పటికీ జనసేన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత జన సైనికులపై, వీర మహిళలపై ఉందన్నారు. జనసేన ని గమనం నేటి రాజకీయాలలో ఒక ప్రభంజనం అవుతుందని, ఆ ప్రభంజనానికి జనసేన నికి అండగా జనసైనికులు నిలవాల్సిన గురు తార బాధ్యత నెలకొందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమైన 5 తీర్మానాలు నిర్ణయించారు.
వాటిలో రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఏకధాటిగా పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడి ఉండాలని సూచించారు. జనసేన బలపరిచిన అభ్యర్థుల విజయం కొరకు ముందుకు సాగాలని తీర్మానించుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు 2014లో పనిచేసిన ప్రతి కుటుంబాన్ని స్వయంగా కలిసి జనసేన బలపరిచిన అభ్యర్థులను విజయం సాధించేందుకు సహకారాందించాలని కోరాల్సి ఉందన్నారు. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో ప్రతి ఇంటికి జనసేన అని అమలుపరిచిన మేనిఫెస్టోను తీసుకెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షులకు, పవన్ కళ్యాణ్ కి మధ్యలో వారధిగా ఒక నాయకుని ఎన్నుకోవడం అవసరమన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ముఖ్య ప్రతినిధులు ప్రవేశపెట్టిన తీర్మాలను అంగీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు టోనీ బాబు సేవలను ప్రశంసిస్తూ, ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగరం నుండి అలీ, విజయవాడ నుండి బి .చెంచు, రామకృష్ణ, ఒంగోలు నుండి సురేష్, వినుకొండ నుండి శివ, సూళ్లూరుపేట నుండి శేఖర్, నెల్లూరు నుండి లక్ష్మి ,ప్రవీణ్, కర్నూలు నుండి కొండ విజయ్ తదితరులతోపాటు లాయర్ మురళి, టీచర్ శ్రీనివాసులు, నెల్లూరు రూరల్ నుండి శ్రీపతి రాము, రాము, భాను, భీమారావు, సుబ్బు, సర్వేపల్లి నుండి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular