జనవరి 2025 ఉత్పత్తిని ప్రకటించిన.
January 2025 production announced.
ఆర్ఎఫ్ సిఎల్ సీజీమ్ ఉదయ్ రాజహంస.
గోదావరిఖని
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో జనవరి – 2025 ఉత్పత్తులను యాజమాన్యం ప్రకటించింది. దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు కేంద్ర ,రాష్ట్ర భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారాన్ని ప్రారంభించారు.. 2021 మార్చ్ 22న కర్మాగారంలో పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్లాంట్లో ఉత్పత్తి అయిన నీమ్ కోటెడ్ యూరియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర,తమిళనాడు, ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాము.
జనవరి 2025 లో కర్మాగారం 110604.33 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేసాము. ఇందులో తెలంగాణకు 54555.30 మెట్రిక్ టన్నులు, ఆంధ్ర ప్రదేశ్ కు 30377.25 మెట్రిక్ టన్నులు, కర్ణాటక కు 8734.68 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్ర కు 2623.59 మెట్రిక్ టన్నులు, ఛత్తీస్‌గఢ్ కు 5643.72 మెట్రిక్ టన్నులు, తమిళనాడు కు 8669.79 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసాము.
ఈ సందర్భంగా, సంస్థ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరియు 110604.33 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించటంలో కీలకపాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ఆర్ ఎఫ్ సి ఎల్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి అభినందనలు తెలిపారు. అలాగే సంస్థకు మద్దతుగా ఉన్న రాష్ట్ర, జిల్లా యంత్రాంగానికి, కేంద్ర ఎరువులు, రసాయానాలు మంత్రిత్వ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.