Sunday, February 9, 2025

నెల్లూరులో జరిగే సిపిఐ(ఎం) రాష్ట్ర 27వ మహాసభలను జయప్రదం చేయండి.

- Advertisement -

నెల్లూరులో జరిగే సిపిఐ(ఎం) రాష్ట్ర 27వ మహాసభలను జయప్రదం చేయండి.

Jayapradham CPI(M) 27th State Congress to be held in Nellore.

బద్వేలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరు నగరంలో జరుగుతున్న నేపథ్యంలో  రాష్ట్ర సమగ్ర అభివృద్ధికై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నంద్యాల జిల్లా,కడప జిల్లాల జీపు జాత బృందాల సభ్యులు అన్వేష్, మనోహర్, చాంద్ బాషా, భైరవ ప్రసాద్, రమణయ్య, సురేష్ బాబు, ఐ. యన్.సుబ్బమ్మ, లక్ష్మీదేవి, నాగరాజు, నాయక్, నరసింహ, బాల వెంకట్, త్యాగరాజు లు నేడు బద్వేలు పట్టణానికి చేరుకోవడంతో సిద్ధవటం రోడ్డు లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్జీవో కాలనీ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది

ఈ సందర్భంగా సిపిఎం కడప జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్వేష్, నంద్యాల జిల్లా నాయకులు నాగరాజు లు సంయుక్తంగా  మాట్లాడుతూ…. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈనెల 30 తేదీ కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్ర జీపు జాతలు జమ్మలమడుగు నుంచి 1 జాత, నంద్యాల నుండి ఒక జాత ప్రారంభమై కడప, నంద్యాల జిల్లాలోని ప్రజలను చైతన్య పరుస్తూ నేడు బద్వేలు ప్రాంతానికి చేరుకోవడం జరిగిందని,
రాష్ట్ర విభజనలో భాగంగా  సేయిల్ ఆధ్వర్యంలో  ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని విభజన చట్టంలో పొందుపరిచినప్పటికీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులు పాలకులు మారినప్పుడల్లా శిలాఫలకాలు వేస్తున్నారే తప్ప నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని, వెనుకబడిన ప్రాంతాలలోనే భారీ పరిశ్రమలను నిర్మించి నిరుద్యోగ యువతీ- యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాల సామాజిక బాధ్యత అని భారత రాజ్యాంగం ఆదేశించిన, దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ నడిబొడ్డు కడప జిల్లాలో భారీ ఉక్కు పరిశ్రమ నిర్మించడానికి వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, ఇనుప ఖణిజా నిక్షేపాలు, సున్నపురాయి, నిక్కెల్, డోలమైట్ వంటి ఎన్నో ఖనిజాలు ఈ ప్రాంతంలో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, కూత వేటు దూరంలోనే ఆర్టీపిపి భారీ విద్యుత్ ధర్మల్ కేంద్రం, గండికోట, మైలవరం జలాశయాలు, హైవే రోడ్లు, రైల్వే లైన్లు, నెల్లూరు కృష్ణపట్నం ఓడరేవులు అన్ని అందుబాటులో ఉన్నా కానీ ఉద్దేశపూర్వకంగానే ఎన్డీఏ భాగస్వాములైన నరేంద్ర మోడీ,చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు శిలాఫలకాలు వేసి  మొండి చేయి చూపించాయని, 2019 అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండుసార్లు శంకుస్థాపన చేసి నిర్మించకుండా ప్రజలను మోసం చేశారన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉపాధి పరిశ్రమలు చాలా అవసరం అని, పరిశ్రమల ద్వారానే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమని అందుకు రానున్న కాలంలో సిపిఎం నిర్వహించే పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్