- Advertisement -
జీడిమెట్లల ఈఎస్ఐ ఆసుపత్రిలో సమయపాలన పాటించని సిబ్బంది
Jedimetla ESI Hospital staff who do not adhere to punctuality
దురుపు ప్రవర్తన, దుర్భాషలు సాధారణం
కుత్బుల్లాపూర్
తిరిగి తిరిగి కాల్లు అరిగిపోతున్నాయి కానీ ఉన్న రోగానికి మాత్రం చికిత్స చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీడిమెట్ల ఈ ఎస్ ఐ ఆసుపత్రికి వచ్చే రోగులు. షాపూర్ నగర్ జీడిమెట్ల ఈఎస్ఐ డిస్పెన్సరీ లో కనీసం సమయపాలన పాటించకుండా, దుర్భాశ లాడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ల ను కలిసేందుకు వెళ్తే సిబ్బంది దురుసు గా ప్రవర్తించడమే కాకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు బైట నిలబెడితున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వారికి ఇష్టమొచ్చిన సమయంలో విధులకు వస్తారని,మధ్యాహ్న భోజన సమయం 2గంటల పైగా తీసుకుంటారని,గంట ముందే డిస్పెన్సరీ మూసివేసి వెళ్తారని చెబుతున్నారు రోగులు. శని వారం మధ్యహం వరకు ఆసుపత్రి సమయం ఉన్నా,మందులు లేవంటూ ఇవ్వకుండా ఆసుపత్రి మూసేశారని తెలిపారు. ఒక్కసారి ఆసుపత్రిలో వైద్యం కోసం వస్తే.. నెల రోజుల వరకు తిరిగినా మందులు లేవని సిబ్బంది తిప్పి పంపిస్తున్నారనీ ఆందోళన చేశారు. ఈఎస్ఐలో కార్మికులకు సకాలంలో వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ,అధికారులు స్పందించి ఇలాంటి నిర్లక్ష్యపు వైద్యులను,సిబ్బందిని తప్పించాలని కోరుతున్నారు
- Advertisement -