వైకాపా ఆరాచకాలకు జిత్వానీ ఒక నిదర్శనం

- Advertisement -

వైకాపా ఆరాచకాలకు జిత్వానీ ఒక నిదర్శనం

Jitwani is a Proof to Vaikapa's Dictators

టిడిపి నేత బుద్దా వెంకన్న
విజయవాడ
వైసిపి ప్రభుత్వ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం చూశాం. గంట, అరగంట మంత్రులు ఏమన్నారో చూశాం. ఇప్పుడు సకలశాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నాం. జగన్ పాలనకి, చంద్రబాబు పాలన కి ఎంత తేడా ఉందో చూడండి. జగన్, వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీ ఇన్నీ కావని అన్నారు.
ఆడుదాం ఆంధ్రా అని కోట్లు దోచుకున్నారు. ఆడుదాం ఆడవాళ్ల తో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారు. ఇప్పుడు నటి జిత్వానీ కేసులో ఐపియస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుంది. కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే .. ఐపియస్ లు పరుగులు పెట్టారంట.ఛీటింగ్ కేసు లో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయం. మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదు. సజ్జల కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం నడిపారు. ఆనాటి డిజిపి కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలని అన్నారు. విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాద్ రెడ్డి, కాంతి రాణా టాటాలను అదుపులోకి తీసుకోవాలి. ఈ కేసుల్లో  పాత్రధారులు, సూత్రధారులను ప్రాసిక్యూట్ చేయాలి. జగన్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేదు. చివరకు ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహరించారు. అమ్మాయి జీవితం నాశనం  చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular