- Advertisement -
ఫిభ్రవరి 8,9 లో జేఎన్టీయూ జే గాం మీట్
JNTU Jay Gam Meet on February 8, 9
హైదరాబాద్
జేఎన్టీయూ యూనివర్సిటీ లో ఫిబ్రవరి 8 మరియు 9 వ తేదీ రెండు రోజుల పాటు జే. గాం 2025 పేరిట గ్లోబల్ అలుమ్ని మీట్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ ఛాన్స్లర్ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు జేఎన్టీయూ వర్సిటీలోని విజిటర్స్ లాంజ్ లో పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్య ఉద్దేశం యూనివర్సిటీలో చదువుకొని వివిధ చోట్ల ఉన్నత స్థితిలో ఉన్న విద్యార్థులను ఒకే వేదిక పైకి తీసుకొని వచ్చి వారి సలహాలు సూచనలను ప్రస్తుత విద్యార్థులకు అందజేసేందుకు ఎంత దోహదపడతాయని తెలిపారు. అదేవిధంగా టైం ట్రెజరీ టాలెంట్ గుర్తింపులో భాగంగా వివిధ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నామని అన్నారు. యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని వాటిని ఈ కార్యక్రమానికి పిలవడం ద్వారా వారు చదువుకున్న యూనివర్సిటీకి వారు సహాయ సహకారాలు అందించడం ద్వారా మరింత మందికి ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు 2023లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించమని త్వరలో జరగబోయే వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటివరకు 18వేల మందికి పైగా పోర్టల్ లో రిజిస్ట్రేషన్ అయ్యారని అన్నారు.
- Advertisement -



