జానీ మాస్టర్ వివాదం.. స్పందిచిన ఫిల్మ్ ఛాంబర్

- Advertisement -

జానీ మాస్టర్ వివాదం.. స్పందిచిన ఫిల్మ్ ఛాంబర్

Johnny Master Controversy. Film Chamber Responds

హైదరాబాద్
జానీ వివాదంపై తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌర‌వ కార్య‌ద‌ర్శి దామోద‌ర్ ప్ర‌సాద్ స్పందించారు. పరిశ్రమలోని లైంగిక వేధింపుల ఫిర్యాదులను ప‌రిష్క‌రించేందుకు 2018 నుంచి లైంగిక వేధింపుల ప‌రిష్కార ప్యానెల్ అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు.మహిళా కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును ప్యాన‌ల్ స్వీక‌రించిన‌ట్లు చెప్పారు. తెలుగు ఫిల్మ్ అండ్‌  టీవీ డ్యాన్సర్స్ అండ్‌ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ మీద వచ్చిన ఫిర్యాదును పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఫిర్యాదు విచార‌ణ ప్ర‌క్రియ‌లో ఉన్న‌ట్లు చెప్పారు. అందువ‌ల్ల విచార‌ణ పూర్తి అయ్యే వ‌ర‌కు స‌ద‌రు మ‌గ కొరియోగ్రాఫ‌ర్‌ను యూనియన్‌లో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి త‌ప్పించాల‌ని ఇప్ప‌టికే ఫెడ‌రేష‌న్‌ను ఆదేశించిన‌ట్లు తెలిపారు.లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించవచ్చున‌న్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వెలుపల ఫిర్యాదు పెట్టె ఉంచిన‌ట్లు చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular