జూబ్లీహిల్స్ అక్టోబర్ 31( వాయిస్ టుడే): జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో బడుగు బలహీన పేద వర్గాలకు అండగా నిలిచేందుకు తాను బరిలో దిగుతున్నట్లు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పేర్కొన్నారు. రెహ్మత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ ఫేజ్ -2 లో సీనియర్ నాయకుడు జాఫర్ హుస్సేన్ ఆయన అనుచరులతో కలిసి బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అందరితో కలిసి పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా ముందుకు వెళతామని ఇలాంటి వివాదాలు తమకు అక్కర్లేదన్నారు. తనపై విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ భవాని శంకర్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు



