రజక సామాజిక వర్గానికి న్యాయం చేయాలి
నందవరం శ్రీనివాసులు రజక
*ఏపి రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు.. *
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు వినతి పత్రాన్ని అందజేసిన నందవరం శ్రీనివాసులు
నంద్యాల
రాష్ట్రంలోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి,రజక సామాజిక వర్గానికి న్యాయం చేయాలని ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు రజక కోరారు. నంద్యాల పట్టణంలోని స్ధానిక ఎస్ ఎన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ యువగళం సమావేశంలో ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి ఆధ్వర్యంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి, రజక సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నందవరం శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ , రాష్ట్రంలో సైకో పాలన పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే బీసీలు అందరూ కృషి చేయాలని లోకేష్ బాబు కోరారని తెలిపారు.అదేవిదంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని,రజకుల సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రజక సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్సీ, ఈ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించడం జరిగిందనీ, వైయస్సార్ పార్టీ ఇంతవరకు ఒక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించలేదని విమర్శించారు. కాబట్టి నంద్యాల జిల్లాలోని రజకులందరు ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు