Sunday, September 8, 2024

అదిలాబాద్ లో కాయ్ రాజా కాయ్

- Advertisement -

అదిలాబాద్, అక్టోబరు 16, (వాయిస్ టుడే): తెలంగాణలో మోగిన ఎన్నికల నగరాలో.. ఏ నేతకు టికెట్ వస్తుంది.. ఏ నేత బరిలో నిలుస్తారు.. ఫస్ట్ లిస్ట్ లో ఏ నేత పేరు ఖరారవుతుందంటూ సాగుతోంది. తెలంగాణ రాజకీయ పండుగలో పొలిటికల్ బెట్టింగ్‌లంట.అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థునులు ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఇంకా టికెట్లు ఖరారు చేయకపోవడంతో ఆశవాహుల ఆశలను అభిమానాలు టెన్షన్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని.. టికెట్ల పైనే పందెం సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ లో కంది శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఖాయం మంటూ జోరుగా బెట్టింగ్ లు సాగుతుంటే.. బీజేపీలో పాయల్ శంకర్ కే టికెట్ అంటూ పందెం కొనసాగుతుందట. టికెట్ పై ఆశలు‌ సన్నగిల్లిన నేతలపై సైతం పది రెట్ల డబుల్ రిటర్న్స్ ఇస్తామంటూ.. బెట్టింగ్ రాయుళ్లు మాయమాటలతో బురిడి కొట్టిస్తుండటంతో మరికొందరు ఆశవాహులపై సైతం కాయ్ రాజా కాయ్ ఆట జోరుగానే సాగుతుందంట. అటు ఆసిపాబాద్ లో కాంగ్రెస్ నేత శ్యాంనాయక్ , రాథోడ్ గణేష్ లపై , బోథ్ లో రాథోడ్ బాపురావు , సోయం బాపురావు ఖానాపూర్ లో రేఖానాయక్ , వెడ్మ బొజ్జలపై కాయ్ రాజా కాయ్ పందెం జోరుగా సాగుతుందంట.అదిలాబాద్ జిల్లాలో బెట్టింగ్ జోరు అంతకు మించి అన్న రేంజ్‌లో సాగుతుందట. అయితే ఈ బెట్టింగ్ మాత్రం ఏ టీం వరల్డ్ కప్ గెలుస్తుంది.. ఏ టీం ఫైనల్ బెర్త్ కన్పాం చేసుకుంటుంది.. ఏ ఆటగాడు ఎక్కువ పరుగులు చేస్తాడని కాదట. మరో వైపు మొదటి విడతలోనే టికెట్ దక్కించుకునే నేతలెవరు అన్న విషయంలోను బెట్టింగ్ సాగుతున్నట్టుగా సమాచారం. కాంగ్రెస్ లో మొదటి విడత రిలీజ్ అవడం ఇందులో ఆదిలాబాద్ , బోథ్ , ఖానాపూర్ , ఆసిపాబాద్ నేతల పేర్లు లేకపోవడంతో రెండో విడతలో అయినా దక్కుతుందా లేదా అన్న బెట్టింగ్ కూడా మొదలెట్టిసినట్టు‌ సమాచారం. అటు బోథ్ లో ఎంపీ సోయం బాపు రావుపై ఏకంగా పక్క పార్టీ నుండి టికెట్ దక్కించుకుంటారంటూ.. హస్తం పార్టీ నుండి బరిలోకి దిగుతారంటూ బెట్టింగ్ లు సాగుతున్నాయంట. ఈ బెట్టింగ్ లు సాగుతున్న నియోజక వర్గాలన్ని ఏజేన్సీ నియోజక వర్గాలు కావడంతో ఇలాంటి తరహా పందాలు గతంలో ఎప్పుడు మా ప్రాంతాల్లో చూడలేదన్న టాక్ నడుస్తుంది.ఇక ఈ విష సంస్కృతి మరింత పెరిగితే ఎన్నికలు ముగిసేనాటికి పందెం రాయుళ్ల ఇళ్లు గుల్లవడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ పందెలాను ఎవరు నిర్వహిస్తున్నారు.. ఎక్కడి నుండి ఈ బెట్టింగ్ మాపియా మానిటర్ అవుతుందన్నది తేలాల్సి ఉంది. టికెట్ల పంపకాలపైనే ఈ రేంజ్ లో దందా సాగితే టికెట్లు దక్కించుకుని బరిలోకి దిగాక గెలుపోటములపై ఇంకా ఏ స్థాయిలో బెట్టింగ్ సాగుతోందో అన్న చర్చ సైతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా సాగుతోంది.ఈ తరహా పాలిటిక్స్‌ తెలంగాణలో.. కాయ్ రాజా కాయ్‌లకు ఆ ఆదివాసీ జిల్లా కేరాప్ అడ్రస్‌గా మారిపోయింది. ఎన్నికల పండుగ రాకతో సర్వసాదరణంగా జరిగే గెలుపోటములపై పందాలను పక్కన పెట్టి ఈసారి అంతకు మించి అన్న రేంజ్‌లో టికెట్ల పైనే పందెం కాస్తున్నారట పందెరాయుళ్లు. పొలిటికల్ హీట్‌ను‌ మరింత క్యాష్ చేసుకునేందుకు సట్కా. మట్కా టీములు గ్రామాల్లో బెట్టింగ్‌ల నిర్వహణకు ఎంట్రీ ఇవ్వడం మరింత కలకలం రేపుతోంది.

Kai Raja Kai in Adilabad
Kai Raja Kai in Adilabad

ఎన్నికల పండుగ వచ్చేసింది. టికెట్లపై భారీ ఆశలు పెట్టుకున్న నేతల్లో టెన్షన్ తారస్థాయికి చేరుకుంది. అభిమానుల్లోను‌ అదే స్థాయిలో హైటెన్షన్ కొనసాగుతోంది. అయితే ఈ టెన్షన్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు బెట్టింగ్ రాయుళ్లు ఉమ్మడి ఆదిలాబాద్ లోకి ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపుతోంది. నేతల గెలుపోటములపై కాకుండా ఏకంగా టికెట్ల ఖరారుపైనే బెట్టింగ్‌లకు తెరలేవడం అక్కడ సంచలనంగా మారింది. ప్రతిపక్ష నేతల టికెట్లు ఖరారు కాకపోవడంతో బెట్టింగ్ రాయుళ్లు సరికొత్త ఎత్తుగడలతో కాయ్ రాజా కాయ్ కు తెర లేపుతున్నారట. ఈ విష సంస్కృతి పట్టణాలతో పాటు పల్లెలకు పాకడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగి హై టెన్షన్ వాతవరణం కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్టీ నియోజక వర్గాలైన బోథ్, ఆసిపాబాద్, ఖానాపూర్ లపై ఈ పందాల దందా కొనసాగుతుండటం మరింత కలవరానికి గురిచేస్తోంది.అయితే ఎన్నికల పండుగ కంటే ముందే దసరా పండుగ దూసుకు రావడంతో పట్టణాలు వీడి పల్లె బాట పడుతున్న జనాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ఈ పొలిటికల్ బెట్టింగ్ దందాను ఆన్ లైన్ అడ్డాగా సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర సరిహద్దులో నిత్యం మట్కా నిర్వహించే కొందరు నిర్వహకులు ఈ ఎన్నికల సీజన్ ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈ బెట్టింగ్ దందాలకు తెర లేపినట్టు సమాచారం. మట్కా రేంజ్ లో నాయకుల పేర్లతో పందెం కొనసాగుతుండటం.. టికెట్ వస్తుందని బెట్టింగ్ కాస్తే.. పది రెట్లు.. రాదని బెట్టింగ్ కాస్తే.. ఐదు రెట్ల డబ్బు తిరిగొస్తుందని జనాలని మాయ చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా లో ఈ దందా మూడు పువ్వులు ఆరుకాయాలుగా సాగుతుందని సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్