Friday, January 17, 2025

హైదరాబాద్ లో ఘనంగా కళావేదిక ఫిల్మ్ మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్

- Advertisement -

హైదరాబాద్ లో ఘనంగా కళావేదిక ఫిల్మ్ మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్

Kalavedika Film Music Awards function in Hyderabad

కళావేదిక అవార్డ్స్ 59వ వార్షికోత్సవం సందర్భంగా బస్సా శ్రీనివాస్ గుప్త, భువన గారి ఆధ్వర్యంలో గీతరచయితలకు, గాయనీగాయకులకు, సంగీతదర్శకులకు అవార్డులు అందించడం జరిగింది. ఆర్.వి. రమణమూర్తి గారు ఎటువంటి ఆశయాల మేరకు కళావేదికను స్థాపించారో ఆ ఆశయాలను ఆయన కుమార్తె భువన గారు సఫలం చేస్తూ ఈ అవార్డుల కార్యక్రమం నిదర్శనంగా చెప్పవచ్చు. జనవరి 4వ తేదీన హైదరాబాద్ లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వాసవి గ్రూప్స్, ఉప్పల ఫౌండేషన్, మనెపల్లి జ్యువలరీ శ్రీ చరణ, కమ్యూనికేషన్ సదరన్ ట్రావెల్స్ పార్టీలు స్పాన్సర్లు సహాయక సహకారాలతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త, దర్శకులూ ముప్పలనేని శివ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఎమ్ ఎమ్ శ్రీలేఖ, సింగర్ కౌసల్య, ప్రఖ్యాత సినీనటులు నందమూరి తారకరామారావు గారి మనవరాలు నందమూరి రూపాదేవి, కొల శ్రీనివాస్, గంధం రాములు, ఎల్.ప్రసన్నకుమార్, వినయ్ హరిహారన్ తదితరులు ల్గొన్నారు.

2024లో విడుదలై ఘనవిజయాలను సాధించిన సినిమాల్లో కృషి చేసిన గీతరచయితలను, సంగీతదర్శకులను, గాయనీగాయకులను, సౌండ్ ఇంజనీర్లను… ఇలా పాట రూపుదిద్దుకోవడానికి శ్రమపడే ప్రతి  కళాకారున్ని ఎంతో వైభవంగా సన్మానించారు. భవిష్యత్తులో ఇలాగే ఆర్.వి.రమణమూర్తి గారి ఆశయాల మేరకు కళావేదిక నిరంతరం పాటుపడుతోందని భువనగారు తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్