- Advertisement -
కాళేశ్వరం బహిరంగ విచారణ…
Kaleshwaram Public Inquiry...
కరీంనగర్, సెప్టెంబర్ 24, (వాయిస్ టుడే)
కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు- డిజైన్ లోపాలు .. అవినీతి ఆరోపణలపై నిజాల నిగ్గు తేలే టైమ్ వచ్చేసిందా? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంక్వయరీ పీక్స్‌కు చేరింది. ఇప్పటికే కీలక డేటా సేకరించిన కమిషన్.. బహిరంగ విచారణ చేస్తోంది. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవని స్ట్రాంగ్‌మెసేజ్ పాస్ చేసింది కమిషన్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ లోపాలు.. ఆర్ధిక అవకతకలపై విచారణ మరింత వేగవంతమైంది. ఈరోజు నుంచి ఐదురోజుల పాటు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో డిజైన్ లోపాలు.. బిల్లుల చెల్లింపుల అక్రమాలు జరిగియానే ఆరోపణలపై శనివారం కల్లా కన్‌క్లూజన్‌కు వచ్చే అవకాశం ఉంది.కాళేశ్వరం ప్రాజెక్టుల మాటున అవినీతి ఎత్తిపోతలు ఆరోపణలు, అభియోగాలపై నిజానిజాలు తెరపైకి వచ్చే టైమ్ వచ్చేసింది. జస్టిస్ చందరఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ఆధ్వర్యంలో విచారణ స్పీడందుకుంది ఇప్పటికే మాజీ ఈఎన్సీ సహా ఏడుగురు సీఈ స్థాయి ఇంజినీర్లను ఆరా తీసింది. ప్రాజెక్టుల డిజైన్ వంటి టెక్నికల అంశాలపై కూడా సమాచారం సేకరించింది . ఆర్దిక అవతకవలపై దృష్టిసారించిన కమిషన్… పనులు పూర్తవ్వకుండానే బిల్లులు ఎలా చెల్లించారంటూ అధికారులను ప్రశ్నించింది. ఒత్తిళ్లపై కూడా పిన్ పాయింట్‌గా ఫోకస్ పెట్టింది.. ఇక ఇవ్వాళ్టి నుంచి . ఇంజనీర్లు,అకౌంట్స్ అధికారులను బహిరంగంగా ప్రశ్నించనుంది కమిషన్. ఐదు రోజులు కొనసాగనున్న ఈ విచారణలో ఇంజినీర్లు, అకౌంట్స్ అధికారులపై ప్రశ్నలు సంధించనుంది కమిషన్.ముందుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు సంబంధించి 40 మంది ఇంజనీర్లు విచారణకు హాజరవుతారు. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్‌మెంట్ రిజిస్టర్, ఎంబుక్‌లను కూడా తీసుకురావాలని ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసింది కమిషన్. ఈ వారంలోనే ENCలను విచారణకు పిలవనుంది కమిషన్. ఇక తుది నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే కాగ్ అధికారుల నుంచి కూడా సమగ్రంగా వివరాలు సేకరించనుంది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి అన్ని నివేదకలను ఇవ్వాలని ఇప్పటికే ఇరిగేషన్ శాఖను ఆదేశించింది కమిషన్.తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ అల్రెడీ స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చినా.. నిజాలను దాచి పెట్టాలని ప్రయత్నించినా అలాంటి వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టడం సహా భవిష్యత్‌లో వారికి ఎలాంటి పదోన్నతులు ఇవ్వొద్దని ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం వుంది. కాళేశ్వరం కమిషన్ విచారణలో దాదాపు తుది దశకు చేరుకుంది. శనివారం కల్లా పూర్తి స్థాయి నివేదకను సమర్పిస్తుందా? ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎలాంటి అంశాలను గుర్తించారు. డిజైన్ల లోపం.. బిల్లుల చెల్లింపుల అక్రమాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది.
- Advertisement -