కాళేశ్వరం జోన్ పరిధి పోలీసులకు క్రీడలు

- Advertisement -

కాళేశ్వరం జోన్ పరిధి పోలీసులకు క్రీడలు

Kaleswaram Zone Range Police Sports

క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం..

రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో కూడా రాణించి మంచిపేరు తీసుకురావాలి:

అడిషనల్ డీసీపీ  అడ్మిన్ రాజు

జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో సందడి..

గోదావరిఖని:

తెలంగాణ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు కోసం క్రీడాకారుల ఎంపికకై కాళేశ్వరం జోన్ స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ  ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు  పోలీస్ అధికారులతో కలిసి ఘనంగా క్రీడలను ప్రారంభించారు.
అడ్మిన్ డీసీపి  మాట్లాడుతూ….పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం 24 X 7 విధినిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ  సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. ఆటల్లో గెలుపోటములనేవి సహజమన్నారు. గెలుపోటముల కంటే టీమ్ స్పిరిట్ గొప్పదన్నారు. క్రీడల్లో గెలుపు కంటే పాల్గొనడం/ పార్టీసిపేషన్ ముఖ్యమన్నారు. ఎల్లప్పుడు విధినిర్వహణలో ఉంటారని, అలాంటి నిర్విరామ విధులలో ఉన్న పోలీసులకు  స్పోర్ట్స్ మరియు గేమ్స్ అనేవి నూతన ఉత్సాహాంతో పాటు ఉల్లాసాన్ని కలిగిస్తుందని, సిబ్బందికి ఎల్లప్పుడు పని ఒత్తిడి తట్టుకోవడానికి, శక్తిని ఇవ్వడానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయని ఈ క్రీడలు స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించు కోవాలని గెలుపోటములను ఏదైనా స్పూర్తిగా తీసుకోవాలని ఇక్కడ ఉత్తమ ప్రతిభ కనబరిచి  కాలేశ్వరం జోన్ తరుపున రాష్ట్ర స్థాయిపోటీలలో పాల్గొని అక్కడ కూడా కాళేశ్వరం జోన్ కు అత్యధిక పతకాలు సాధించి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ పోటీలు రామగుండం పోలీస్ కమిషనరేట్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీస్  టీమ్స్ మధ్య షటిల్ బ్యాట్మెంటన్, వాలీబాల్,కబడ్డీ, ఖో ఖో, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, స్విమ్మింగ్, తగ్గాఫర్, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జవలిన్ మరియు అథెలిటిక్స్ క్రీడలు లలో సెలక్షన్ లు జరుగుతాయి.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ఏ ఆర్ ఏసీపీ లు ప్రతాప్, సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి, మల్లేశం, సంపత్, ములుగు ఆర్ఐ సంతోష్ కుమార్, తదితరులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular