Thursday, May 21, 2026

పుంజుకుంటున్న కళ్యాణ్ జ్యువెల్లర్స్ షేర్లు

- Advertisement -

పుంజుకుంటున్న కళ్యాణ్ జ్యువెల్లర్స్ షేర్లు

Kalyan Jewelers shares on the rise

హైదరాబాద్
ఇటీవల కల్యాణ్ జ్యువెల్లర్స్ షేర్లు భారీ పతనానికి గురయ్యాయి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ అద్భుతంగా వచ్చినప్పటికీ వరుసగా స్టాక్ ఫాల్ అవుతూ దాదాపు 40 శాతం పడిపోయింది. కల్యాణ్ జ్యువెల్లర్స్ షేర్లను పెంచేందుకు మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ ఫండ్ మేనేజర్లు ఫ్రాడ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. డబ్బులు తీసుకుని కంపెనీ షేర్లను అమాంతం పెంచేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. కంపెనీపై వస్తున్న ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. తమ కంపెనీ షేర్లను పెంచేందుకు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ షేర్ల పతనం ఆగలేదు. కేవలం రెండు వారాలలోనే రూ.27,400 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. మోతీలాల్ ఓస్వాల్ ఈ ఆరోపణలపై స్పందించింది. తమ కంపెనీ ఫండ్ మేనేజర్లు ఎలాంటి తప్పు చేయలేదని తెలిపింది. కల్యాణ్ జ్యువెల్లర్స్ షేర్ పెంచేందుకు ఎలాంటి అవినీతి చేయలేదని వివరణ ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ ప్రకటన తర్వాత కల్యాణ్ జ్యువెల్లర్స్ షేర్లలో కదలిక వచ్చింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్