నంబర్ వన్ నియోజకవర్గంగా కామారెడ్డి

- Advertisement -

మంత్రి కేటీఆర్

కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ మాచారెడ్డి మండల భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పాల్గోన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ కెసిఆర్  కామారెడ్డి లో పోటీ చేస్తున్నారనగానే ప్రతిపక్షాలు నీరుగారిపోయాయి. పోటీ చేసేందుకు వెనుకాడూతూ పారిపోయే ప్రయత్నం చేస్తున్నాయి. మొదటి రోజు నుంచి తెలంగాణ ఉద్యమ జెండా ఎగిరిన గడ్డ కామారెడ్డి. అందుకే ఇయాల కామారెడ్డిలో కేసీఆర్ పోటీతో ప్రతిపక్షాల పరిస్థితి పోచమ్మ గుడి ముందు గొర్రె పొట్టేలును కట్టేసినట్లు తయారయిందని అన్నారు. ఇవాళ కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గం అవుతుందని కామారెడ్డి ప్రజలు నమ్ముతున్నారు. ఇంకా కామారెడ్డిలో  అఖండ మెజార్టీతో   కెసిఆర్  విజయం ఖాయం. గంప గోవర్ధన్ స్వయంగా కేసీఆర్ ను  పోటీ చేయాలని కోరిన నేపథ్యంలో కెసిఆర్  కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని అన్నారు.

Kamareddy as the number one constituency
Kamareddy as the number one constituency

కొడంగల్ లోనే ఓడిపోయి పారిపోయిన రేవంత్ రెడ్డి, కామారెడ్డికి వచ్చి గెలుస్తానని  అంటుండు. కొడంగల్ లో మా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పైనే గెలవలేని రేవంత్ రెడ్డి, కేసిఆర్ పై పోటీ చేస్తారని బీరాలు పలుకుతుండని విమర్శించారు.కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తే డిపాజిట్ గల్లంతు చేసి ఉద్యమ వేడి చూపిస్తాం. బలిసిన కోడి చికెన్ సెంటర్ ముందుకొచ్చి తొడగొట్టినట్టు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉంది.  11సార్లు అవకాశం ఇచ్చిన ఏం చేయలేని కాంగ్రెస్ పార్టీ… మరొక్కసారి అవకాశం అడుగుతుంది. ప్రతిదానికీ ఢిల్లీ వెళ్లి తెల్చుకునే కాంగ్రెస్ పార్టీ, బిజెపిలు మనకెందుకు. గతంలో రైతులు వ్యవసాయానికి, కరెంట్ కోతలతో కష్టాలు పడింది మర్చిపోవద్దు. అందరికీ మనం ఒక్కసారి కాంగ్రెస్ చీకటి రోజులు రావన్న, రైతులు అర్ధరాత్రి బోర్ల దగ్గర పండుకునే పరిస్థితి రావాల్నా ఆలోచించాలని అన్నారు. రానున్న 30 రోజులపాటు భారత రాష్ట్ర సమితి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పార్టీని ఘనంగా గెలిపించుకోవాలి. ఎవరి గ్రామాల్లో వారు పార్టీ పథకాలను ప్రభుత్వం సాధించిన ప్రగతిని, భవిష్యత్తులో అందించే సంక్షేమ కార్యక్రమాలను, ప్రతి ఒక్కరికి తెలిపి మెజార్టీ తీసుకువచ్చేలా చూడాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular