కంగనాకు కలిసి రాని కాలం

- Advertisement -

కంగనాకు కలిసి రాని కాలం

Kangana is not together

ముంబై, జనవరి 20, (వాయిస్ టుడే)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన.. ఎమర్జెన్సీ సినిమాను వివాదాలు వీడటం లేదు. సినిమా షూటింగ్ మొదలు విడుదలయ్యే వరకు అనేక ఆటంకాలను ఎదుర్కొన్న కంగనా.. మూవీ రిలీజ్‌ అయ్యాక కూడా నిరసనలను ఎదుర్కొంటున్నారు. పంజాబ్‌లో పలు సిక్కు సంఘాలు ఎమర్జెన్సీ సినిమాను బ్యాన్ చేయాలని ఆందోళనకు దిగాయి.మాజీ ప్రధానమంత్రి ఇందిరా  జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీ సినిమా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. బయోపిక్ మూవీని ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతూ వచ్చింది. సినిమా షూటింగ్ ముగిశాక సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం కంగనా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అన్ని అడ్డంకులను ఎదుర్కొన్న కంగనా  సినిమాను రిలీజ్ చేశారు.ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ అయ్యాక కూడా కంగనా నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ పంజాజ్‌లో ఆందోళనలు మిన్నంటాయి. పలు సిక్కు సంఘాలు థియేటర్ల ముందు ఆందోళనకు దిగాయి. అమృత్‌సర్‌లోని థియేటర్ల ముందు ఎస్జీపీసీ సభ్యులు నిరసనకు దిగారు. ఎమర్జెన్సీ చిత్రంపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు సిక్కు సంఘాల నేతలు. పరిస్థితి చేయి దాటితే పంజాబ్ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ అల్టిమేటం జారీ చేశారు. దీంతో థియేటర్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది రాష్ట్రప్రభుత్వం.కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నికయ్యాక కూడా ఇలాంటి సినిమాలు చేయడం సరికాదన్నారు సిక్కు సంఘాల నేతలు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular