కానిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శారద జ్ఞాన పుత్ర ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆస్థాన మండపం నందు స్వామివారి శేష వస్త్రము, తీర్థ ప్రసాదాలను అందజేశారు.కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆస్థాన మండపం నందు శారద జ్ఞాన పుత్ర ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే ధార్మిక ప్రవచన ఉపన్యాసం చేశారు. ఈ ప్రవచన కార్యక్రమం నందు కాణిపాకం దేవస్థానం స్వామివారి విశిష్టత, సంకటహర చతుర్థి వ్రతం విశిష్టత, వినాయక స్వామి విశిష్టత, తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయానికి ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులతో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు గురు దక్షిణామూర్తి వద్ద మాజీ ఇస్రో చైర్మన్ తీర్థ ప్రసాదాలు అందజేశారు