Friday, May 16, 2025

కన్నడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన‌ ల‌వ్ మాక్‌టైల్ 2 ఈనెల 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల

- Advertisement -

కన్నడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన‌ ల‌వ్ మాక్‌టైల్ 2 ఈనెల 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల

కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత రచయిత దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన లవ్ మోక్టైల్ 2 మూవీ ఈనెల 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. డార్లింగ్ కృష్ణ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించ‌డ‌మే కాక త‌నే హీరోగా నటించి మెప్పించాడు. కన్నడలో ఈ లవ్ మోక్టైల్, లవ్ మోక్టైల్ 2 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలవ‌గా.. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ : కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని తెలుగులో అనువదించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. డార్లింగ్ కృష్ణ కన్నడలో బ్లాక్ బస్టర్ హీరోగా మంచి సినిమాల్లో నటించాడని. అతను దర్శకత్వం చేస్తూ నటించిన ఈ సినిమా కన్నడ బ్లాక్ బస్టర్ గా నిలవగా ఈ నెల 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను చూసి బాగుందని రిలీజ్ చేయడానికి ఇష్టపడి కొనుక్కున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటీనటులు :
డార్లింగ్ కృష్ణ, మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్