ముద్రగడకు సంఘీభావం తెలిపిన కాపు నేతలు

- Advertisement -

ముద్రగడకు సంఘీభావం తెలిపిన కాపు నేతలు

Kapu leaders expressed solidarity with Mudragada

కిర్లంపూడి
కాపు ఉద్యమనేత,వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ,ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, తదితరులు బుధవారం సాయంత్రం  కాకినాడ జిల్లా, కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకుని సంఘీభావం తెలిపారు…ఈసందర్భంగా  వారు విలేకర్లతో మాట్లాడుతూ..ముద్రగడ ఇంటి మీదకు ఒక వ్యక్తి అర్ధరాత్రి వచ్చి జనసేన పార్టీ కార్యకర్తను అంటూ బీభత్సం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండించారు కాపు ఉద్యమాన్ని నడిపి,అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడపై జరిగింది చిన్న దాడి అని అనుకోవడం లేదన్నారు. 70 ఏళ్ల పైబడిన ఆయన అనేక అవమానాలు తట్టుకుని నిలబడ్డారని, ఆయన ఇంటిపైజరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇలాంటి ఆరాచక ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మౌనవ్రతం వీడి ఖండించాలని డిమాండ్ చేశారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular