Sunday, February 9, 2025

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక-2024

- Advertisement -

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక-2024

Karimnagar Police Commissionerate Annual Crime Report-2024

పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి

కరీంనగర్

కరీంనగర్ కమిషనరేట్ పొలీసులము ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సేవలందించుటకు అనుక్షణం పనిచేస్తున్నాము.
డయల్ 100:
కమిషనరేట్ లో 2023 సంవత్సరంలో డయల్ 100 ద్వారా 43,815 ఫిర్యాదులు రాగా, ఈ సంవత్సరం డయల్ 100 ద్వారా 46,191 ఫిర్యాదులు రాగా బ్లూ కొట్ట్స్ ద్వారా అట్టి పిర్యాదులకు స్పందించాము.
ఫిర్యాదులు:
2023 సంవత్సరంలో కమిషనరేట్ వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లకు కలిపి 14,296 ఫిర్యాదులు అందినవి.
2024 సంవత్సరంలో కమిషనరేట్ వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లకు కలిపి 18,625 ఫిర్యాదులు అందినవి.
పోలీస్ స్టేషన్ ద్వారా అందిన పిటిషన్లలో ఫైనాన్స్ సంబందించినవి 23% కాగా, బాడీలి అఫెన్సెస్ శారీరక నేరాలు, 11%,  రోడ్ యాక్సిడెంట్స్ 5%,  మరియు ఇతరాలు 61% గా ఉన్నవి.
సీసీసీ  ఫిర్యాదులు:
2023 సంవత్సరంలో కమిషనరేట్ కార్యాలయానికి సీసీసీ  ద్వారా 1301 ఫిర్యాదులు రాగా,
2024 సంవత్సరంలో కమిషనరేట్ కార్యాలయానికి సిసిసి ద్వారా 3121 ఫిర్యాదులు అందినవి. ఇందులో భూమికి సంబందించిన 57% కాగా, కుటుంబ సంబంధిత 7%, మోసానికి సంబంధించినవి 16% మరియు ఇతరాలు 20% గా ఉన్నవి.
ఎఫ్.ఐ.ఆర్. ల నమోదు:
2023 సంవత్సరంలో కమిషనరేట్ వ్యాప్తంగా 6041 కేసులు నమోదు కాగా,
2024 సంవత్సరంలో 7027 కేసులు నమోదు అయినవి.
అయితే మొత్తంగా కమీషనరేట్ వ్యాప్తంగా 7027 ఎఫ్.ఐ.ఆర్. కేసులు నమోదు కాగా 5180 విచారణ పూర్తి అయినవి.
నేరాల విశ్లేషణ:
ఈ సంవత్సరం ఆర్థిక నేరాలకు సంబంధించి మొత్తం 726 కేసులు నమోదు కాబడి అత్యధికంగా  నమోదు అయిఉంది. ఇందులో సైబర్ నేరాలు 46%,  భూమికి సంబంధించిన నేరాలు 15%, నగదుకు సంబంధించి 8%, చిట్ఫండ్ సంబంధించి 7%, జాబ్ ఫ్రాడ్ సంబంధించి 5% ఉన్నవి.
రాయిటింగ్, అల్లర్లు, దొమ్మి, కేసులు 44% తగ్గినవి:
కమిషనరేట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో రాయిటింగ్ అల్లర్లు, 25 కేసులు నమోదుకాగా, 2024 లో 14 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో   పొలిస్తే రాయిటింగ్ అల్లర్లు కేసులు 44% తగినవి.
రాబరీ మరియు డెకాయిటి దోపిడి, కేసులు 38% తగ్గినవి:
కమిషనరేట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో రాబరీ మరియు డెకాయిటి కలిపి 08 కేసులు నమోదుకాగా, 2024 లో 05 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో  పొలిస్తే రాబరీ మరియు డెకాయిటి కేసులు 38% తగ్గినవి.
హత్యలు 33% తగ్గినవి:
కమిషనరేట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో 19 హత్య కేసులు నమోదుకాగా, 2024 లో 14 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో   పొలిస్తే హత్యకేసులు 33% తగ్గినవి.
చైన్ స్నాచింగ్ కేసులు 30% తగ్గినవి:
కమిషనరేట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో చైన్ స్నాచింగ్ కేసులు 10 నమోదుకాగా, 2024 లో 07 కేసులు నమోదయ్యాయి.
గత సంవత్సరం తో పోలిస్తే చైన్ స్నాచింగ్ కేసులు 30% తగ్గినవి.
ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు 9.36% తగ్గినవి:
కమిషనరేట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో 203 ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల కేసులు నమోదుకాగా, 2024 లో 184 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో   పొలిస్తే  ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు 9.36% తగ్గినవి.
ఫైనాన్సియల్ సైబర్ క్రైమ్స్ ఆర్ధిక సైబర్ నేరాలు:
సైబర్ నేరాల ఫిర్యాదులు ఎన్ సి ఆర్ పి:
2023 సంవత్సరంలో 1654 ఫిర్యాదులు రాగా,
2024 వ సంవత్సరం లో  2282 ఫిర్యాదులు అందినవి.
కమీషనరేట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో ఆర్ధిక సైబర్ నేరాలు 258 కేసులు నమోదుకాగా, 2024 లో 270 కేసులు నమోదయ్యాయి. అయితే 2023 సంవత్సరంలో ఆర్ధిక సైబర్ నేరాల్లో 114 కేసుల్లో బాధితులు కోల్పోయిన 1.74 కోట్ల రూపాయలు ఫుట్ ఆన్ హొల్డ్ లో ఉంచగలగగా, 2024 సంవత్సరంలో ఆర్ధిక సైబర్ నేరాల్లో 233 కేసుల్లో బాధితులు కోల్పోయిన 9.87 కోట్ల రూపాయలు పుట్ ఆన్ హొల్డ్ లో ఉంచగలిగాము. 2024 సంవత్సరానికి గాను 2.57 కోట్ల రూపాయలు బాధితులకు అప్పగించుటకు కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందగా 2023 సంవత్సరానికి గాను 66 లక్షల రూపాయలకు పొందినాము.
ఆర్థిక నేరాలు:
భూమి సంబంధిత కేసులు:
కమీషనరేట్ వ్యాప్తంగా 2024 సంవత్సరంలో భూతగాదాలకు సంబందించి మరియు నకిలీ పత్రాలు సృష్టించి భూమి కాజేసిన ఘటనల్లో 113 కేసులు నమోదై, 179 మంది అరెస్ట్ చేయబడ్డారు. అందులో 60 కేసులు నకిలి సరిహద్దులు సృష్టించినందుకు నమోదు కాబడినవి.
చిట్ ఫండ్ కేసులు:
కమిషనరేట్ వ్యాప్తంగా 2024 సంవత్సరంలో చిట్ ఫండ్ మోసాలకు సంబంధించి 50 కేసులు నమోదై 09 మంది చిట్ ఫండ్ డైరక్టర్స్ తో సహా 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
జాబ్ ఫ్రాడ్ కేసులు:
కమిషనరేట్ వ్యాప్తంగా 2024 సంవత్సరంలో జాబ్ ఫ్రాడ్ మోసాలకు సంబంధించి 33 కేసులు నమోదై 27 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
పోలీస్ ఎన్ఫోర్స్మెంట్:
ఇసుక అక్రమ రవాణా, కేసులు మరియు వాహనాల స్వాధీనం:
కమిషనరేట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో ఇసుక అక్రమ రవాణా చేసినందుకు గాను 27 కేసులు నమోదై 120 మంది ఆరెస్ట్ కాబడి 244 వాహనాలను స్వాధీనం చేసుకోగా, 2024 సంవత్సరంలో ఇసుక అక్రమ రవాణా చేసినందుకు గాను 610 కేసులు నమోదై 1198 మంది అరెస్ట్ కాబడి 797 వాహనాలు స్వాధీనం చేసుకోబడినవి.
ఎన్.డి.పి.ఎస్. కేసులు:
కమిషనరేట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో ఎన్.డి.పి.ఎస్. మాదకద్రవ్యాల..గంజాయి, కేసులు 22 నమోదై, 55 మంది అరెస్ట్ కాబడి, 27 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా,
2024 సంవత్సరంలో ఎన్.డి. వి. ఎస్. మాదకద్రవ్యాల  గంజాయి, కేసులు 39 నమోదై, 85 మంది ఆరెస్ట్ కాబడి 128 కిలోల గంజాయి స్వాధీనం చేయడం జరిగింది.

జూదం సంబంధిత కేసులు:
కమిషనరేట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో 43 జూదం కేసులు నమోదై, 281 మంది నిందితులు అరెస్ట్ కాగా, 2024 సంవత్సరంలో 91 జూదం కేసులు నమోదై, 593 మంది నిందితులు అరెస్ట్ కాబడినారు.
పి.డి.ఎస్. బియ్యం అక్రమ రవాణా:
కమిషనరేట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో పి.డి.ఎస్. బియ్యం అక్రమ రవాణా చేసినందుకు గాను 10 కేసులు నమోదై 22 మంది అరెస్ట్ కాబడి 06 వాహనాలను స్వాధీనం చేయబడి,  553 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా,
2024 సంవత్సరంలో పి.డి.ఎస్. బియ్యం అక్రమ రవాణా చేసినందుకు గాను 99 కేసులు నమోదై 189 మంది అరెస్ట్ కాబడి, 96 వాహనాలు స్వాధీనం చేయబడి, 4289 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకోబడినవి.
ఎక్సైజ్ కేసులు:
కమిషనరేట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో 183 ఎక్సైజ్ కేసులు నమోదు కాబడి 2641 లీటర్ల మద్యాన్ని స్వాధీనంచేసుకోగా,
2024 సంవత్సరంలో 360 ఎక్సైజ్ కేసులు నమోదు కాబడి 4257 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాము.
ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు రోడ్డు భద్రతా కొరకు తీసుకున్న చర్యలు:
ట్రాపిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా పలు శాఖల ట్రాఫిక్, మున్సిపల్ ఆర్ అండ్ బి, ఆర్.టి.సి., హెచ్.కె. ఆర్. రోడ్ వేస్, స్మార్ట్ సిటీ, అధికారులతో కమిషనరేట్ కేంద్రంలో 2024 లో 3 సమన్వయ సమావేశాలు నిర్వహించాము. కరీంనగర్ లోని ఆటో డ్రైవర్ల పూర్తి వివరాలతో కూడిన సమాచారం సేకరించి డేటా బేస్ ఏర్పాటుచేసి పొందుపరిచాము. దీనివలన ఏదేని సంఘటన జరిగిన వెంటనే గుర్తించుటకు వీలుంటుంది. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు భారీ మరియు అతిభారీ వాహనాల అనుమతిని  కట్టడి చేసి పరిమితులు విదించి నిర్దిష్ట సమయాలను కేటాయించాము. దీని వలన నగరంలో చాలా వరకు ట్రాఫిక్ సమస్యను నియత్రించగలుగుతున్నాము. ట్రాఫిక్ సమస్యకు కారణమైన రోడ్డు మరియు ఫుట్ పాత్ ల ఆక్రమణల తొలగింపు కొరకు ఈ సంవత్సరం 50 స్పెషల్ డ్రైవ్ లు  నిర్వహించాము.  పలు శాఖల అధికారుల సమన్వయముతో నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు గాను 5 జంక్షన్ల వద్ద పూర్తి స్థాయిలో సిగ్నల్స్ వ్యవస్థ ను అందుబాటులోకి తీసుకువచ్చాము. రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకునే భద్రతా చర్యల్లో భాగంగా యూ టర్న్ ల వద్ద సోలార్ బ్లింకర్స్ మరియు సైన్ బోర్డ్స్ ఇతర శాఖల అధికారుల సమన్వయముతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాము. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా ముఖ్యంగా సరైన పత్రాలు, నెంబర్ ప్లేటు లేని వాహనాలు మరియు మైనర్ డ్రైవింగ్ లపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి పట్టుబడ్డవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాము.
కమీషనరేట్ వ్యాప్తంగా 2023 సంవత్సరంలో నిర్వహించిన వాహన తనిఖీలు మరియు స్పెషల్ డ్రైవ్ ల యందు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై 5329 మందిపై కేసులు నమోదుకాగా, 53 మందికి జైలు శిక్ష పడింది.
2024 సంవత్సరంలో నిర్వహించిన వాహన తనిఖీలు మరియు స్పెషల్ డ్రైవ్ ల యందు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై 6005 మందిపై కేసులు నమోదు కాగా, 147 మందికి జైలు శిక్ష పడింది.
2023 సంవత్సరంలో సరైన నెంబర్ ప్లేటు లేని వాహనాలు 766 పట్టుబడగా, 2024 సంవత్సరంకి గాను 1281 వాహనాలు పట్టుబడినవి.
2023 సంవత్సరంలో మైనర్లు వాహనాలు నడుపుతూ 294 మంది పట్టుబడగా, 2024 సంవత్సరంకు గాను 195మంది పట్టుబడ్డారు.
కరీంనగర్ పోలీసులు తీసుకున్న క్రియాశీలకమైన చర్యలు:
యాంటి డ్రగ్ అవగాహనా కార్యక్రమాలు మరియు కమిటీల ఏర్పాటు:
ఇప్పటివరకు ఈ సంవత్సరం వివిధ పాఠశాలలు, కళాశాలల్లో 56 యాంటి డ్రగ్ సమావేశాలు నిర్వహించడంతో పాటు, 158 యాంటి డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసాము.
మరింత పటిష్టంగా రాత్రి పెట్రోలింగ్:
శాంతి భద్రతలకు సంబందించి డయల్ 100 , పెట్రోకార్ విభాగాలకు సమాచారం అందిన వెంటనే నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక వివరాలు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టడం జరుగుతున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ప్రజలకు వేగవంతంగా సేవలందిస్తున్నాము. కమిషనరేట్ నందు రాత్రి పెట్రోలింగ్ మరింత పటిష్టం చేసాము. ప్రతిరోజు రాత్రి పెట్రోలింగ్ లో నైట్ డ్యూటీ అధికారిగా ఒక ఏసిపి స్థాయి లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, నైట్ రౌండ్ అధికారులుగా ఎస్సై స్థాయి అధికారి, నైట్ పెట్రోలింగ్ అధికారిగా ఏఎస్సై లేదా హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ మరియు వీరితో పాటు అదనంగా నైట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులుగా ఇద్దరు ఆర్ ఐ లేదా ఆర్ ఎస్సై లు విధుల్లో ఉండేలా చర్యలు చేపట్టాము.
రౌడీ షీటర్ల పై నిఘా:
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం పలు నేరాల్లో నిందితులైన 23 మందిపై రౌడీ షీట్లు తెరిచాము.
కమిషనరేట్ వ్యాప్తంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న 23 మంది ప్రాణాలను కాపాడగలిగాము.
కమిషనరేట్ వ్యాప్తంగా రెండు ఘటనల్లో బాధితులు పోగొట్టుకున్న 20 తులాల బంగారు ఆభరణాలు గుర్తించి వారికి అందిచాము.
కమిషనరేట్ వ్యాప్తంగా నమోదైన పలు కేసుల్లో, ఈ సంవత్సరం 05 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్షపడేలా కృషి చేసాము.
ట్రాఫిక్ విభాగం సేవల విస్తరణ:
కరీంనగర్ తో పాటు కమిషనరేట్ పరిధిలోని హుజరాబాద్ మరియు గంగాధరలో ట్రాఫిక్ సమస్యలు నియంత్రించుటకు ట్రాపిక్ పోలీసులను కేటాయించి సేవలందిస్తున్నాము.
భరోసా కేంద్రం ప్రారంభం:
కరీంనగర్ కొత్తపల్లి నందు తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ ఉమెన్ సేఫ్టీవింగ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనరేట్ కొరకు నూతనంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా, 1000 చదరపు గజాల స్థలంలో, 6800 చదరపు అడుగుల విస్తీర్ణంలో చాల అద్భుతంగా నిర్మించబడిన భరోసా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్  జితేందర్ ఐపిఎస్ గారిచే గత 22వ తేదీ డిసెంబర్ నాడు  ప్రారంభించబడింది.
2025 సంవత్సర లక్ష్యాలు:
2025 సంవత్సరంలో రెగ్యులర్ పోలీసింగ్ తో పాటు ముఖ్యంగా కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాము. విసబుల్ పోలీసింగ్ కి మరింత ప్రాముఖ్యత పెంచనున్నాము. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాము. రౌడీ షీటర్లు,  వీధి రౌడీలుగా చలామణి అయ్యే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తామని తెలిపారు. ఆర్ధిక నేరాలకు పాల్పడే వారిపై దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. సైబర్ నేరాలు మరియు యాంటీ డ్రగ్ అవగాహనా మరియు  నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామని అన్నారు. ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని తెలిపారు. ప్రజలతో మంచి సత్సంబంధాలను కలిగివుండి, భాదితులకు వెంటనే  ప్రతిస్పందించే  ఖచ్చితమైన  పోలీసు సేవలు కరీంనగర్ కమీషనరేట్  ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాము.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్