Tuesday, January 27, 2026

ఐక్యమత్యంగా ఉంటే కర్నాటక తరహా ఫలితాలు

- Advertisement -

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు

Karnataka style results if united
Karnataka style results if united

హైదరాబాద్, సెప్టెంబర్ 17, (వాయిస్ టుడే ):  నేతలంతా ఐక్యమత్యంగా ఉంటే కర్నాటక తరహా ఫలితాలు సాధించ వచ్చని  కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఎక్కువున్నాయని ఖర్గే వెల్లడించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ రెండో రోజు సమావేశాల సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఫార్మూలాను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న ఖర్గే.. ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కే విజయవకాశాలున్నట్లు తెలిపారు. నేతలంతా ఐక్యంగా పనిచేయాలని ఖర్గే ఈ సందర్భంగా పిలుపిచ్చారు. అందరూ ఐక్యంగా ఉంటే కర్నాటక తరహా ఫలితాలు ఉంటాయని వివరించారు.కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో దీనిపై తీర్మానం చేశారు. రాజీవ్‌గాంధీ పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ఖేరా పేర్కొన్నారు. మన్మోహన్‌ హయాంలో బిల్లును ఉభయసభలు ఆమోదించాయని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో,అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తుచేశారు.ఈ విస్తృతస్థాయి సమావేశంలో CWC సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేత ఆహ్వానితులతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, సీనియర్‌ నేతలు, పార్లమెంటరీ పార్టీ సభ్యులు హాజరయ్యారు. CWC సమావేశం ముగిసిన తర్వాత లో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ నిర్వహించనుంది. సాయంత్రం తుక్కుగూడలో విజయభేరి పేరుతో భారీ బహిరంగ సభను కాంగ్రెస్‌ నిర్వహించనుంది. ఇందులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కర్నాటక తరహాలో ఆరు గ్యారెంటీలను ఈ సభలో సోనియా గాంధీ ప్రకటించనున్నారు.ఈ సమావేశంలో సీడబ్లూసీ సభ్యులు పలు కీలక అంశాల గురించి చర్చించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పలు అంశాల గురించి చర్చిన నేతలు.. ఇండియా కూటమి, సీట్ల పంపకాలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. తెలంగాణలో మున్ముందు అనుసరించాల్సిన వ్యూహాల గురించి కూడా చర్చించినట్లు పేర్కొంటున్నారు.

Karnataka style results if united
Karnataka style results if united
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్