కరుణగిరి ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ నిర్వాహకులకు స్టేషన్ బెల్ ఇవ్వకుండా రిమాండ్ కు తరలించాలి

- Advertisement -

కరుణగిరి ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ నిర్వాహకులకు స్టేషన్ బెల్ ఇవ్వకుండా రిమాండ్ కు తరలించాలి

Karunagiri area Shree Sai Nilayam apartment managers remanded without giving bail

ఖమ్మం
నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణగిరి ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ బాధ్యులు మాజీ ప్రెసిడెంట్ డివిఎన్ శరత్  కుమార్ , వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా నాయకులు తోటపల్లి నాగరాజు లు మాట్లాడుతూ ఈనెల 17వ తారీఖున కరుణగిరి ప్రాంతం శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ కమిటీ నిర్వాహకులు బి.కృష్ణారెడ్డి , ఏ.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ కుల వివక్షత , జాతి వైషమ్యాలు , మత విద్వేషాలను రెచ్చగొట్టుతూ దళితులను & గిరిజనులు అంటరాని వారిగా చూస్తూ అలాగే ముస్లిం మైనారిటీల మనోభావాలను కించపరుస్తూ అపార్ట్మెంట్ లలో కిరాయిలకు ఇళ్ళు ఇవ్వకూడదని నిబంధన చేశారు . ఈ విషయం సాంఘిక మాధ్యమం ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ఆయా కమిటీ నిర్వాహకులు అపార్ట్మెంట్ ఉంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ వారిని దౌర్జన్యంగా ఇళ్ళు ఖాళీ చేయించారు . నాలుగు సంవత్సరాలుగా 101 ప్లాట్ లో కిరాయికి ఉంటున్న మాదిగ కమ్యూనిటీకి చెందిన తోటపల్లి నాగరాజు దివ్యాంగుడును దౌర్జన్యంగా అతి కిరాతికంగా ఇల్లు ఖాళీ చేపించారు . 405 ఫ్లాట్ లో ఉంటున్న గిరిజన లంబాడి కులం కు చెందిన శరత్ నాయక్ పై కమిటీ సభ్యుడు కె.నాగార్జున మా నిర్ణయాలను ప్రశ్నిస్తావా ? ఎంత ధైర్యం నీకు….. అంటూ, దౌర్జన్యంగా దాడికి చేసి గాయపరిచారు . అదేవిధంగా 102 ప్లాట్ లో నివాసం ఉంటున్న దళిత కులానికి చెందిన బి.నరసింహ అనే ఒక ఏ ఆర్ కానిస్టేబుల్ ను బెదిరించి అతని పార్కింగ్ ప్లేసును దరిపల్లి కోటయ్య అనే మరొక సభ్యుడు తో కబ్జా చేశారు . ఎవరైనా ఎస్సీ , ఎస్టీ , ముస్లిం మైనార్టీ వాళ్లు అపార్ట్మెంట్లో ఇళ్ళు కిరాయి అడిగితే ఇంటి ఓనర్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా కమిటీ నిర్వాహకులు అడ్డు తగులుతున్నారు అని అన్నారు . ఇట్టి విషయమై స్థానిక ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్ కమిటీ నిర్వాహకుల పైన కుల సంఘాలు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది . రూరల్ పోలీస్ వారు తేది 18/11/24న బి. కృష్ణారెడ్డి పై ఎస్సీ& ఎస్టీ కేసు నమోదు చేయడం జరిగింది . అతనికి స్టేషన్ బెయిల్ కాకుండా రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు . ఇటువంటి వారి పై కేసు నమోదు అయిన తర్వాత కూడా బయట ధైర్యంగా తిరుగుతా ఉంటే సమాజం పై చెడు ప్రభావము పడుతుందని అన్నారు . ఇటువంటి వ్యక్తుల ఆలోచనలు సభ్యసమాజానికి ప్రమాదం . కుల వివక్షత జాతి వైషమ్యాలు మత విద్వేషాలను ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారిపై ఇన్వెస్టిగేషన్ జరిపించాలని కోరారు . అపార్ట్మెంట్లో ఉంటున్న మరికొందరు ఏ. శ్రీనివాస్ , దరిపల్లి కోటయ్య , లక్కినేని అనురాధ , ఏడు కొండలు , కే. నాగార్జున లపై కేసు నమోదు చేయాలని పత్రిక ముఖంగా వేడుకున్నారు . ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్  బానోత్ రమేష్ నాయక్ , ప్రధాన కార్యదర్శి రవిచంద్ర చోహన్ , తెలంగాణ బంజారా ఎంప్లాయిస్ ఫెడరేషన్  నాయకులు భూక్య లచ్చ నాయక్ , తెలంగాణ స్టేట్ అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జై భీమ్ నారమళ్ళ , గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు , ఎరుకల సంఘం నాయకులు పాలకుర్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular