నామినేటేడ్ పదవులలో ముదిరాజ్ లకు పెద్ద పీట
సీఎం కేసీఆర్
ఎర్రవల్లి: టీటీడీపీ ఛీస్ కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ సమక్షంలో అధికార పక్షం భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతా. 119 సీట్లల్లో 112 మాత్రమే మన లెక్కలోకి వస్తాయ్. తమాషాకి అభ్యర్థులను పెట్టద్దు నిలబడితే గెలవాలి. వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగింది. గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారు. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయి. ముదిరాజ్ ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలి. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తాం. ఈటెల ఎవరిని ఎదగనివ్వలేదు, బండ ప్రకాష్ ని తీసుకొచ్చి పదవులు ఇచ్చామని అన్నారు.