సీపీఎం నేతలతో కవిత భేటీ
హైదరాబాద్
Kavitha meets with CPM leaders
ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఎంబి భవన్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకై సిపిఎం మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, జాగృతి , బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి. అన్ని వర్గాలు, రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నాము.. బహుజనుల ప్రతీకగా అసెంబ్లీ లో పూలే విగ్రహం ఏర్పాటు కోసం జాగృతి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. రౌండ్ టేబుల్ సమావేశాలు, జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం. పూలే విగ్రహ ఏర్పాటు కోసం అన్ని వర్గాల ప్రజల మద్దతు కుడగడుతున్నం. 42 శాతం బిసి బిల్లుకు కేంద్రం ఒప్పుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిల పక్షం డిల్లీకి తీసుకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రప్రభుత్వం కులగణన వివరాలు వెల్లడించాలని అన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ భారతదేశంలో అణగారిన వర్గాల కొరకు పూలే పోరాడారు. కుల అసమానతలు మన దగ్గర ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. కేంద్రంలో మనువాదము అధికారంలో కొనసాగుతుంది. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుంది. కులగణన వివరాలు రాష్ట్రప్రభుత్వం వెల్లడించాలి. కేంద్రం కులగణనకు వ్యతిరేకం. జాగృతి న్యాయమైన డిమాండ్లకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నుమని అన్నారు.