సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర..
రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Kavitha visits Singareni coal mines…
Demands government pay Rs 50,000 crore in dues.
హైదరాబాద్, జూన్ 15 :వాయిస్ టుడే
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మైన్-1 వద్ద బొగ్గుబాయి కార్యక్రమాన్ని ప్రారంభించి సింగరేణి కార్మికులతో ముఖాముఖి చర్చించారు.
టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతెలంగాణ రక్షణ సేన (TRS) చేపట్టిన “బొగ్గుబాయి” కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మైన్-1సందర్శించి సింగరేణి కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, అనంతరం నిర్వహించిన గేటు మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు.కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి ప్రాంతాలకు వచ్చి వినతిపత్రాలు ఇస్తూ కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు. పాలసీలు రూపొందించి అమలు చేయాల్సిన పాలకులు విస్మరించారని విమర్శించారు. సింగరేణి కార్మికులకు హక్కుగా రావాల్సిన డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని కవిత అన్నారు. కొత్త బొగ్గు గనులు తీసుకొస్తే లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని, కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ ను క్రమంగా మూసివేసి, ఓపెన్ కాస్ట్లను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సింగరేణిని నిజంగా కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే సంస్థకు బకాయి ఉన్న రూ.50 వేల కోట్లను వెంటనే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్, ఢిల్లీలో ఉండి సింగరేణికి కొత్త బొగ్గు బావులు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. సింగరేణిలో నెలకు రెండుసార్లు జరగాల్సిన మెడికల్ బోర్డులను నిర్వహించేందుకు కూడా పోరాటం చేయాల్సి వస్తోందని అన్నారు.టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత సింగరేణిలో కవిత తొలి పర్యటన ఇదే. కాసిపేట నుంచి ప్రారంభమైన “బాయి బాట” కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని, సింగరేణి 11 ఏరియాల్లో పర్యటించి కార్మికుల సమస్యలను వారిని అడిగి ప్రత్యక్షంగా తెలుసుకుంటామని చెప్పారు. సింగరేణి కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందుబాటులో లేవని కవిత అన్నారు. కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందించడమే తమ లక్ష్యమన్నారు.తెలంగాణ రక్షణ సేన పాంచజన్యం పేరిట 5 కీలక అంశాలతో ప్రజల ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు సింగరేణి కార్మికులతో అనుబంధం కొనసాగుతోందని, ఎక్కడ ఉన్నా తెలంగాణ రక్షణ సేన “పాంచజన్యం” పేరిట ఐదు కీలక అంశాలతో ప్రజల ముందుకు వచ్చిందన్నారుతెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు సింగరేణి కార్మికులతో అనుబంధం కొనసాగుతోందని, ఎక్కడ ఉన్నా వారి కోసం పోరాటం చేశానని కవిత గుర్తు చేశారు. కొత్త రాజకీయ శక్తిగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీకి సింగరేణి కార్మికుల దీవెనలు, మద్దతు ఉండాలని కోరారు.
కొత్త బొగ్గు గనులు తీసుకొస్తే లక్షకు ఉద్యోగాలు వస్తాయి
తెలంగాణ రక్షణ సేన చేపట్టిన “బొగ్గుబాయి” కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మైన్-1ను సందర్శించారు. అక్కడ సింగరేణి కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన గేటు మీటింగ్‌లో ఆమె రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాంతాలకు వచ్చి వినతిపత్రాలు ఇస్తూ కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.కార్మికులకు హక్కుగా రావాల్సిన డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బొగ్గు గనులు తీసుకొస్తే లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చని, కానీ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ మైనింగ్‌ను మూసివేసి ఓపెన్ కాస్ట్‌లను పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంస్థకు బకాయి ఉన్న రూ. 50 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ముట్టడి తర్వాతే నెలకు రెండుసార్లు జరగాల్సిన మెడికల్ బోర్డులను నిర్వహించే పరిస్థితి వచ్చిందన్నారు. కార్మికుల హక్కుల కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ సంయుక్తంగా పోరాడుతాయని కవిత ప్రకటించారు. ఈ ఐక్యత రానున్న ఎన్నికల్లోనూ కొనసాగుతుందని, కార్మికుల కోసం హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ రాజీలేని పోరాటం చేస్తున్నారని కొనియాడారు.




