పవన్ పై కవిత కామెంట్స్…
మండిపడుతున్న జనసైనికులు
హైదరాబాద్, ఏప్రిల్ 10, (వాయిస్ టుడే )
Kavitha's comments on Pawan...
“అన్ ఫార్చునేట్లే హి బికేమ్ ఎ డిప్యూటీ సీఎం..”
“హి ఈజ్ నాట్ ఎ సీరియస్ పొలిటీషియన్ ”
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలివి. పవన్ కల్యాణ్ ని కించపరిచేలా ఆయన స్థాయిని తగ్గించేలా కవిత మాట్లాడారు. దీంతో జనసైనికులకు కోపం వచ్చింది. కవితను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి వీడియోలు వైరల్ చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయినప్పటి వీడియోలు బయటకు తీసి.. సీరియస్ పొలిటీషియన్ అంటే ఇలా స్కామ్ లు చేసి అరెస్ట్ కావాలేమో అంటూ కౌంటర్లిస్తున్నారు.
కేసీఆర్ కూతురిగా వారసత్వ రాజకీయాలతో నెట్టుకొస్తున్న కవి, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అయ్యారని, పార్టీ పేరు చెప్పి ఆమె రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు జనసైనికులు. బీఆర్ఎస్ ఎప్పుడూ వైసీపీకి మద్దతిస్తుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని విమర్శిస్తుంటారు. తాజాగా కవిత కూడా సందర్భం లేకుండా పవన్ ని విమర్శించడానికి కారణం ఇదేనంటున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తమకున్న అక్కసునంతా ఆమె ఇలా బయటకు చూపెడుతున్నారని చెబుతున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బీఆర్ఎస్ సీరియస్ గా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏడాదిలోగా ఎన్నికలొస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోకాలం నిలబడదని అనేవారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఇటీవల కవిత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కవిత వ్యాఖ్యల్ని అక్కడ కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో ఇటు ఏపీ రాజకీయాలపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు, పవన్ ని కించపరిచేలా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు జనసైనికులు.అనవసరంగా పవన్ కల్యాణ్ పై కామెంట్స్ చేసి, జనసైనికుల్ని రెచ్చగొట్టిన కవిత.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ గా మారారు. కవిత లిక్కర్ స్కామ్ వీడియోలను వెలికితీసి మరీ కౌంటర్లిస్తున్నారు. కవిత జైలుకెళ్లడాన్ని ట్రోల్ చేస్తున్నారు. కవిత చేసిన స్కామ్ వల్లే ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ.. రెండూ అధికారానికి దూరమయ్యాయని అంటున్నారు. మొత్తమ్మీద కవిత ఏరికోరి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైనట్టు తెలుస్తోంది. అనవసరంగా ఆమె జనసైనికుల్ని రెచ్చగొట్టారని, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని అంటున్నారు నెటిజన్లు.