34.8 C
New York
Saturday, June 22, 2024

22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

- Advertisement -

పార్టీకి పూర్వ వైభవమే లక్ష్యంగా, పార్లమెంట్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలనే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

వరుస బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇక ఇటీవల మెదక్ జిల్లా నుస్తులాపూర్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ సీఎం రేవంత్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం నాటి కేసీఆర్ ను ప్రజలు మళ్లీ చూడబోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో జోష్ పెంచేందుకు, అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బస్సు యాత్రలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే తాజాగా బస్సు యాత్ర షెడ్యూల్ ను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం కొనసాగించనున్నట్లు సమాచారం. యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!