హైదరాబాద్ నవంబర్ 2: అధికార మదంతో కేసీఆర్ విర్రవిగుతున్నారని మాజీకేంద్ర మంత్రి రేణుకాచౌదరి అన్నారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ…‘‘రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసం కాదు. ప్రతి మనిషిపై BRS పార్టీ లక్షకు పైగా అప్పు భారం వేసింది. దొంగ విత్తనాలు మూలంగా 8 వేల మంది రైతు కుటుంబాల నాశనం అయితే కేసీఆర్ నోరు మేధపని పరిస్థితి. ఈ ప్రభుత్వం కౌలు రైతుని మర్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు దృష్టిలో పెట్టుకుంది. కాళేశ్వరం వల్ల బంగారం అంత కేసీఆర్ ఇంటికి చేరింది. గతంలో తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పక్కన పెట్టి గెలిపిస్తే రైతులకి కేసీఆర్ చేసింది ఏంటి? ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూములు కాజేసింది నిజం కాదా.? మీపార్టీ నేతలు చేసిన దోపిడీ ప్రజలు గమనిస్తున్నారు. కాళేశ్వరం విషయంలో క్వాలిటీ కంట్రోల్ ఏం అయింది. కాళేశ్వరం భవిష్యత్ ఏంటి…? పక్కన ఊరు ప్రజల గురించి ఆలోచించారా…? పంటకు రేట్లు ఆడిగితే జైలు శిక్షలు ..నాలల్లో నీళ్లు రాని పరిస్థితి. కేసీఆర్ కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ధరణి పోర్టల్ ఎందుకు పనిచేయటం లేదు.. ఈ పోర్టల్ సామాన్యుడికి మేలు జరిగిందా ఆలోచించాలి. కేజీ టూ పీజీ అన్నారు.. BRS నేతలు చదువుకుంటే బాగుండేది. కాళేశ్వరం ఫెయిల్యూర్ అని ఒప్పుకొని చెంపలు వేసుకో కేసీఆర్’’ అని రేణుకా చౌదరి ఎద్దేవ చేశారు.



