Tuesday, January 7, 2025

రెండు జాతీయ పార్టీల మధ్య నలిగిపోతున్న కేసీఆర్

- Advertisement -

రెండు జాతీయ పార్టీల మధ్య నలిగిపోతున్న కేసీఆర్
హైదరాబాద్, జూలై 13

KCR is torn between two national parties

బీఆర్ఎస్.. ప్రస్తుతం తెలంగాణలో కనుమరుగవుతున్న పార్టీ. కాంగ్రెస్, బీజేపీ నేతలను ఈ అంశంపై పలకరిస్తే, కనుమరుగైపోయిన పార్టీ అని అంటారు. వాళ్ల మాటలు ఎలా ఉన్నా, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన సీట్లు, సాధించిన ఓట్లను బట్టి బీఆర్ఎస్ ప్రాభవం క్రమక్రమంగా తగ్గిపోతోంది. ప్రచార సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలుపుతానన్నారు కేసీఆర్. కానీ, ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్యే ఆయన నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.వరుస ఓటముల తర్వాత కేసీఆర్ పెద్దగా బయట కనిపించడం లేదు. ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. అటు చూస్తే కుమార్తె కవిత జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. కేటీఆర్ మాట వినే నేతలు తక్కువే. ఇదే అదునుగా పార్టీ నుంచి వలసలు జోరందుకున్నాయి. పోతే పోండి అన్న ధోరణిలో కేసీఆర్ ఈమధ్యే సమావేశాలు నిర్వహించి ఉన్న లీడర్లకు క్లాసులు తీసుకున్నారు. దొరికిందే ఛాన్స్ అని వరుసబెట్టి నాయకులు జంప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవడం అంత ఈజీ కాదనే వాదన జరుగుతోంది. ఇదే సమయంలో ఫాంహౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్ ముగించుకుని వచ్చిన వెంటనే కేసీఆర్ సడెన్ మీటింగ్ పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కే బెయిల్ రావడం కష్టమైపోయింది. అలాంటిది, కీలక సూత్రధారిగా పేర్కొన్న కవితకు బెయిల్ రావడం అంత ఈజీ పని కాదు. కానీ, కేటీఆర్ మాత్రం కవితను బయటకు తీసుకొస్తామని శపథం చేశారు. కొద్ది రోజుల క్రితం పార్టీ నేతలకు ఇదే చెప్పారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన ఆయన, హరీష్‌తో కలిసి వారం రోజులు అక్కడే ఉన్నారు. లాయర్లతో అనేక చర్చలు జరిపారు. కవితనూ కలిసి ఓదార్చారు. ఈ టూర్ నేపథ్యంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. బీజేపీతో కేటీఆర్, హరీష్ సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రపోజల్‌కు కమలనాథులు సరే అన్నారని, కాకపోతే కవితను అప్రూవర్‌గా మారమని కండిషన్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని నగరానికి వచ్చీ రాగానే కేసీఆర్‌కు కేటీఆర్, హరీష్ వివరించినట్టు మాట్లాడుకుంటున్నారు.ఓవైపు బీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్ లాగేసుకుంటోంది. ఇంకోవైపు పలు కేసులు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మద్దతు ఉంటేనే మనుగడ సాధ్యమనే భావనలోకి కేసీఆర్ వచ్చినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అందుకే, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించి వారిని ట్యూన్ చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా కేటీఆర్, హరీష్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో కేసీఆర్ తీసుకోబోతున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బీజేపీలోకి హరీశ్ రావు

KCR is torn between two national parties

తెలంగాణలో నేతలు పార్టీల మార్పులకు సంబంధించి చర్చలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజా రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఊహించని నేతలు సైతం ఇతర పార్టీలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కారణాలు ఏవైనా కూడా పార్టీని వీడటంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నది.గతంలో కాంగ్రెస్ ను ఖాళీ చేసేందుకు ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఖాళీ అవుతుందా..? ఏందీ అని అనుకుంటున్నారు జనాలు. ఇంకొందరు నేతలేమో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమంటున్నారు. ఇటీవలే జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ నేతలు.. అది కూడా పేరు మోసిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీ పార్టీలోకి వెళ్లారు. అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది.ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. తాజాగా ప్రకాశ్ గౌడ్ కూడా జాయిన్ అవుతనంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరో అంశం తెరమీదకు వస్తోంది. సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది.ఈ అంశంపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందని చెప్పారు. హరీశ్ రావు కూడా పార్టీని వీడబోతున్నారని, బీజేపీలోకి వెళ్లబోతున్నారంటూ ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. అందువల్ల కేసీఆర్ రాజకీయాలను వదిలేసి ఇంట్లోనే ఉంటే బెటర్ అని ఆయన సలహా ఇచ్చారు.కాగా, చాలా సందర్భాల్లో హరీశ్ రావు పార్టీ మారబోతున్నారంటూ పలువురు నేతలు పేర్కొన్న సందర్భంలో ఆయన స్పందించారు. ఆ నేతల వ్యాఖ్యలను ఖండించారు. తాను బ్రతికున్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని తేల్చిచెప్పారు. పార్టీని విడాల్సి వస్తే తాను రాజకీయాల నుంతి శాశ్వతంగా తప్పుకుంటానంటూ చెప్పుకొచ్చారు. అయితే, రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో భారీగా చర్చ కొనసాగుతుంది. హరీశ్ రావు నిజంగానే పార్టీ మారుతున్నారా..? అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు హరీశ్ రావు పార్టీ మారబోతున్నారా లేదా అనేది. ఎందుకంటే.. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇదే మాదిరిగా పార్టీని మారబోం.. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ లోనే ఉంటామని ఇవాళ చెప్పి.. రేపు మరో పార్టీలో చేరిపోయారు. ఈ పరిస్థితులను పరిశీలించిన ప్రజలు.. హరీశ్ రావు కూడా పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్