Sunday, December 22, 2024

సింగరేణి కార్మికుల త్యాగాన్ని కేసీఆర్ సర్కార్ మరచిపోయింది

- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

భూపాలపల్లి:  తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములు. జెండాలను ఎజెండాలను పక్కనబెట్టి అంతా ఏకమైతే తెలంగాణ సాకారమైందని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం నాడు కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా అయన సింగరేణి కార్మికుల తో మాట్లాడారు. మీ త్యాగాన్ని బీఆరెస్ ప్రభుత్వం మరిచిపోయింది. సకలజనుల సమ్మెలో మీరు భాగస్వాములు కాకపోతే.. తెలంగాణ సాకరమయ్యేదా? కార్మికుల వైపు ఉన్నామనేది వాళ్లే, ప్రభుత్వంలో ఉన్నది వాళ్లే. సమస్యలు పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నది వాళ్లే. ఒకే ఒక్క అధికారిని సింగరేణికి పెట్టి దివాళా తీయించారు. వారి తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారు. సింగరేణిని ప్రయివేటు పరం చేయడంలో బీఆరెస్ ఒప్పుకుంది నిజం కాదా. అరబిందో కు మైన్ అప్పగించింది నిజం కాదా. తాడిచర్ల మైన్ ను నీ అనుయాయులకు అప్పగించింది నిజం కాదా. నైని కోల్ మైన్ ను ఆదానీకి కట్టబెట్టాలని చూసింది నిజం కాదా. మైన్ ను ప్రయివేట్ పరం చేయడాన్ని అడ్డుకున్నది మేం కాదా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.
సింగరేణి ఎన్నికలను జరపకుండా కేసీఆర్ ఎందుకు తప్పించుకుంటున్నారు. జెన్ కో బిల్లులు కట్టి ఉంటే, ఓపెన్ కాస్ట్ మైన్ లు ప్రయివేటు పరం చేయకుండా ఉంటే ఎన్నికలు జరిపేవారు కాదా. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబట్ 3న కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. తెలంగాణ సాధించిన కార్మికులుగా మిమ్మల్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. తెలంగాణను గుల్ల చేసిన ఈ పందికొక్కుల పని పెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్