Sunday, September 8, 2024

కేసీఆర్ బాగుండాలి: బండి

- Advertisement -

కరీంనగర్, అక్టోబరు 11: అదిలాబాద్ వేదికగా అమిత్ షా బహిరంగ సభకు విపరీతమైన స్పందన వచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. మా గ్రాఫ్ తగ్గినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మేము రాజకీయంగా కొట్లాడుతాం అంతే గానీ.. కేసీఆర్ బాగుండాలని కోరారు. నిజాంకు వ్యతిరేకంగా వచ్చే రజాకార్ సినిమా అంటే మీకు భయమెందుకు? అని ప్రశ్నించారు. మీరు నిజాం, రజాకార్ల వారసులా? ఎంఐఎం బాధపడుతుందని మీరెందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి 50 ఏళ్లకు మెచ్యురిటీ వస్తే పెళ్లెప్పుడు పిల్లలెెపుడు? అంటూ వ్యంగాస్త్రం వేశారు. వారంటీ లేని పార్టీ గ్యారెంటి ఇస్తే ఎవరు నమ్ముతారని అన్నారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేస్తుందన్నారు. కరీంనగర్ లో పోటీ చేయాలనుందని నా కోరిక చెప్పాను. మా అధిష్టానం ఆదేశిస్తే చేస్తా అని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్న అమిత్ షా కామెంట్స్ నిజం కాదా?? అని అన్నారు. మీరిద్దరూ ఒకటి కాకపోతే ఎంఐఎంకు దమ్ముంటే.. మీరు అల్లాను ప్రార్థిస్తే.. హైదరాబాద్ దాటి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా ఎందుకు మార్చడం లేదన్నది చెప్పాలన్నారు. జనసేనతో పొత్తు గురించి అధిష్టానం చూసుకుంటుంది. మాకున్న సమాచారం ప్రకారం మేము ఒంటరిగానే వెళ్తామన్నారు. ఎంఐఎం అడ్డాగా చెప్పుకునే భాగ్యలక్ష్మి గుడి దగ్గరకు అన్ని పార్టీలను రప్పించిన ఘనత మాదన్నారు. చివరకు ఎంఐఎం నేతలు కూడా భాగ్యలక్ష్మి ఆలయం పేరు కలవరిస్తున్నారని అన్నారు బండిసంజయ్.గ్రామాల్లో పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

KCR should be good: Bandi
KCR should be good: Bandi

సొమ్ము ఒక్కరిది సోకు ఒక్కరిది అంటూ మండిపడ్డారు. గ్రామాల్లో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. గొనె సంచి పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రోకరిజం చేస్తుందన్నారు. ఉపాధి హామీ పైసలు కూడా కేంద్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ పథకాలు కేంద్రమే ఇస్తుందని, పంట నష్ట పోయిన రైతులకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదని మండిపడ్డారు. యువతను గంజాయికి అలవాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్ తో అడ్డుకుంటున్నారని, బీఆర్ఎస్ పార్టీ కబ్జాలు తట్టుకోలేక కష్టాల్లో ఉన్నారని అన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారం వస్తుందన్నారు. కొంత మంది అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. సీఎం కార్యాలయంలో పదవి విరమణ పొందిన అధికారులతో ఎలా పనిచేస్తున్నారు? అని ప్రశ్నించారు. సీట్లు ప్రకటించిన బిఆర్ఎస్ ఏ టికెట్ గ్యారెంటీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సర్వేలు కూడా బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే అప్పుల తెలంగాణగా మారుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? కేసీఆర్ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. ముఖ్యమంత్రి సతీమణి తిరుమలలో పూజలు చేస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ ఎందుకు పూజలు చేయడం లేదు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు.. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ కు ఓటమి తప్పదు అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్