నిజామాబాద్ జిల్లా:నవంబర్ 24: సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆర్మూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.
ఆర్మూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. టేబుల్‌పై డబ్బులు పెట్టిన వాళ్లనే సీఎం కేసీఆర్ మంత్రులను చేస్తున్నాడన్నారు. ఇచ్చిన ఏ హామీని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఆర్టీసీ స్థలాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం కబ్జా చేసిందన్నారు.
కేసీఆర్ ఇక నీ సమయం అయిపోయిందన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందన్నారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్ ఆడుకున్నారన్నారు. నిజామాబాద్‌లో బీడీ కార్మికులకు ప్రత్యేక ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామన్నారు. అధికారం ఇస్తే 4 శాతం మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. పసుపు పరిశోధనా కేంద్రాన్ని నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్నారు.