Sunday, September 8, 2024

ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

- Advertisement -

కేసీఆర్ కు బీజేపీ కౌంటర్

హైదరాబాద్, సెప్టెంబర్ 16:  సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. చట్టసభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును.. అలాగే 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి తెలంగాణ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్‌లో వందమంది ఎమ్మెల్యేలు ఉంటే.. అందులో మహిళా ఎమ్మెల్యేలు 5 శాతం మాత్రమే ఉన్నారని విమర్శలు చేసింది. అలాగే బీఆర్ఎస్ ఎంపీలు 16 మంది ఉంటే అందులో ఒక్కరే మహిళా ఎంపీ ఉన్నట్లు పేర్కొంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిపినా 33 శాతం కావడం లేదంటూ విమర్శించింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ సభ్యుల్లో 33 శాతం మహిళలు ఉండాలనే విషయం కేవలం ఫామ్‌హౌస్‌ ప్లానింగ్‌లోనే ఉందని రియాల్టీలో మాత్రం చాలా దూరంగా ఉందంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసింది.

ఇదిలా ఉండగా శుక్రవారం రోజున ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరగగా… ఈ అంశంపై ఏకగ్రీవంగా తీర్మానిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో సభ ముందుకు ఈ రెండు బిల్లులను తీసుకురావాలని కోరారు. బీసీ(ఓబీసీ) బిల్లు, మహిళా బిల్లను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేలా..  బీఆర్ఎస్ ఎంపీలు చేపట్టాల్సిన కార్యచరణపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అలాగే మహిళా సంక్షేమం కోసం, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు.. దేశవ్యాప్తంగా.. వారి హక్కులు కాపాడేలా కేంద్రాన్ని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే తరతరాలుగా కుల వృత్తులు చేస్తూ.. దేశ సంపద సృష్టిలో కీలకంగా భాగస్వాములైన బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించేలా కేంద్రం ముందుకు సాగాలని కోరారు. బీబీసీ(ఓబీసీ)లను విద్య, ఆర్థిక అలాగే సామజిక రంగాల్లో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. తెలంగాణలో బీసీల సంక్షేమం కోసం అమలు చేస్తున్నటువంటి ఫథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.తెలంగాణ మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపినట్లు గుర్తుచేశారు. ఇది పంపి తొమ్మిది సంవత్సరాలు గడిచినా కూడా కేంద్రం స్పందిచలేదని అన్నారు. చట్టసభల్లో బీసీలకు సరైన ప్రాధాన్యం దక్కినప్పుడే వారి సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా.. బీసీ బిల్లును ఆమోదించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ డిమాండ్లను.. రాజ్యసభ, లోక్‌సభల్లో లేవనెత్తాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 18 నుంచి జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. ఏ ఏ బిల్లులు ప్రవేశపెడతారో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి.. ఉమ్మడి పౌర స్మృతి బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటి బిల్లులు ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం ఉందంటూ ప్రచారాలు సాగాయి. అయితే ఏం జరుగుతుందో తెలియాలంటే సమావేశాలు జరిగే వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్