4.8 C
New York
Tuesday, February 27, 2024

నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, జిల్లాల్లో కెసిఆర్ ఎన్నికల యాత్ర

- Advertisement -

హైదరాబాద్:నవంబర్ 03: నేడు బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మూడు జిల్లాలో నిర్వ‌హించే ప్ర‌జాఆశీర్వ‌ద స‌భ‌లో ఇవాళ పాల్గొన‌నున్నారు. నిర్మల్, నిజమాబాద్, జగిత్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు.

సీఎం కేసీఆర్ ఎన్నికల పర్యటనలో భాగంగా ముదోల్, ఆర్మూరు, కోరుట్లలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

నిర్మల్ జిల్లా ముదోల్ నియోజక వర్గం భైంసాలో ప్రజా ఆశీర్వాద సభ‌, నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద సభ, జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో ప్రజా ఆశీర్వాద సభలు ఉన్నాయి.

కాగా సీఎం కేసీఆర్ సభ సందర్బంగా కోరుట్ల వైపు వెళ్లే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వాహనాల దారి మళ్లించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తులు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బంది పడకుండాపోలీస్ లు ముందస్తు చర్యలు తీసుకున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!