అభివృద్ధిలో ఎల్బీనగర్ ను అగ్రభాగాన నిలుపుతా : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

- Advertisement -

అభివృద్ధిలో ఎల్బీనగర్ ను అగ్రభాగాన నిలుపుతా

: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఘనంగా సత్కరించిన పార్టీ శ్రేణులు

ఎల్బీనగర్, వాయిస్ టుడే:

ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబురాలను జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురంలోని జి.ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్‌లో కార్యకర్తలు సన్మాన సభను నిర్వహించారు. ఈ సభలో పార్టీ శ్రేణులు, అభిమానులు తీసుకొచ్చిన పుష్పగుచ్చాలు, శాలువాలతో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తనను ఓడించడానికి ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశాయని, వాటిని ప్రజలు తిప్పికొట్టి తనను భారీ మెజారిటీతో గెలిపించారని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సతీమణి కమలా సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular