Sunday, September 8, 2024

పొంగులేటి ఇంటి నుంచి కీలక పత్రాలు స్వాధీనం

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 10, (వాయిస్ టుడే ): జూబ్లీహిల్స్ లోని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు నేటితో ముగిసాయి. మూడు బ్యాగులు, ఒక బ్రీఫ్‌కేస్‌, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక రూమ్‌ లాక్‌ చేసి ఉండడంతో కీస్ తీయకుని రావాలని పొంగులేటి భార్యకు ఐటీ అధికారులు సూచించారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎదురుచూసి కీస్ తీసుకురాలేకపోవడంతో డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లి సోదాలు జరిపారు.పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రెండో రోజుల వరకు ఐటీ అధికారులు సోదాలు కొనసాగాయి. అయితే దీనిపై ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. నాలుగు వందల మంది ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇంకా పది చోట్ల ఐటీ దాడులు సాగుతూనే ఉన్నాయి.. సెంట్రల్, స్టేట్ ఎన్నికల కమిషన్ లకు ఫిర్యాదు చేశాను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వాలకు సపోర్టు ఉందా అని పిస్తోంది.. ఎన్నికల కమిషన్ బ్యాలెన్స్ తప్పుతున్నారా లేక అధికారం ఒత్తిడికి లోంగుతున్న రా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల మీదనే దాడులు జరుగుతున్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల మధ్య ఫెవికాల్ సంబందం ఉంది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.తుమ్మల ఇంట్లో తనిఖీల్లో ఏమి లభించలేదు.. నా ఇంట్లో ఐటీ సోదాల్లో వారికి ఏమి దొరకలేదు.. నా అల్లుడు మీద దురుసుగా ప్రవర్తించారు.. నా ఉద్యోగి జయ ప్రకాష్ నీ కొట్టారు.. థర్డ్ డిగ్రీ ఉపయోగించారు.. వంటి కాలు మీద చైర్ లో నిలబెట్టారు.. ఒప్పుకోవాలని బలవంతం చేశారు అని ఆయన వెల్లడించారు. ఐటీ అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అంటూ మండిపడ్డారు. దీని వెనుక కారణాలు ఏమిటి.. మ్యాన్ హ్యాండిలింగ్ చేసే హక్కు ఎవ్వరూ ఇచ్చారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. మిమ్ములను ఎవ్వరూ పంపించారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడిగారు. వారి కోసం మీరు చేసే పద్ధతులు సరికాదు.. తల్లిదండ్రుల మీద చర్యలు తీసుకుంటాము.. జైళ్లలో పెడతమని బెదిరించారు.. అధికారులు మీరు హద్దుల్లో ఉండాలి.. ఐటీ రూల్స్ అందరికీ తెలుసు, అధికారంలో ఉన్న పార్టీకి వత్తాసు పలికితే చాలు అన్నట్లుగా ఉన్నారు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.

కేసీఆర్ ను గద్దె దించండి

తెలంగాణ ఎన్నికల అసలు ఘట్టం మొదలైంది. ఈరోజు నామినేషన్‌కు చివరి తేదీ. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యే ఉంది. బీఆర్‌ఎస్‌కు ముఖ్యమంత్రే స్టార్ క్యాంపెయినర్. కాంగ్రెస్‌కు చెందిన రేవంత్ సుడిగాలి పర్యటనలో దూసుకుపోతున్నారు. రేవంత్ తన ప్రసంగాల్లో బీఆర్‌ఎస్‌పై పదునైన డైలాగులతో పార్టీని ఉర్రూతలూగిస్తున్నారు. మంచి స్పందన రావడంతో పార్టీ మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. కాగా.. కొనాపూర్ లో రేవంత్ రెడ్డి పర్యటించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కేసీఆర్ పూర్వీకుల గ్రామం కొనాపూర్ కు వెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డిని చూసిన కొనాపూర్ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్లుగా గుర్తురాని కొనాపూర్ ఇవాళ గుర్తొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే రేవంత్ రెడ్డి కి గ్రామస్తులమంతా కలిసి నామినేషన్ డబ్బులు అందజేశారు. కాంగ్రెస్ గెలవాలని కోరారు. గ్రామస్తులకు రేవంత్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ను తప్పకుండా గద్దె దించుతామన్నారు.కామారెడ్డిలో నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామని హామీలతో బీసీ డిక్లరేషన్ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సభకు కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు సమాచారం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ బహిరంగ సభలో పాల్గొని బీసీ డిక్లరేషన్ విడుదల చేయనున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్