Monday, May 18, 2026

ఖబడ్డార్.. గూండాల్లారా..

- Advertisement -

ఖబడ్డార్.. గూండాల్లారా..

Khabaddar.. goons..

భూ అక్రమార్కుల భరతం పడుతాం. చీల్చి చెండాడుతాం
మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరిక
హైదరాబాద్ జనవరి 22
ఖబడ్డార్.. గూండాల్లారా.. భూ అక్రమార్కుల భరతం పడుతాం. చీల్చి చెండాడుతాం అని మల్కాజ్ గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. బుదవారం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ  మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని 149 ఎకరాల్లో ఉన్న ఏకశిలా నగర్‌ లో నిన్న జరిగిన సంఘటన మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరిగాయని,అంతిమన్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి.. వందల మంది బాధితులతో కలిసి ప్రజలకు నిన్న జరిగిన సంఘటన విషయంలో వాస్తవాలు తెలియజేస్తున్నానన్నారు.పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన తర్వాత ప్రతినిత్యం హైదరాబాద్ తో పాటు మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలో జరిగిన అనేక దుర్మార్గాలు, పేదల సమస్యలపై పోరాటం చేస్తున్నా.రేవంత్ ప్రభుత్వం హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అకారణంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. 40-50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వాలు చెరువుల పక్కన, లే-అవుట్లలో పట్టాలు ఇస్తే ఇండ్లు కట్టుకున్నారు.ఆనాడు హైదరాబాద్ కు వలస వచ్చే పేద ప్రజానీకానికి టైగర్ నరేంద్ర గారు నుంచి మొదలు బద్దం బాల్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారి లాంటి బీజేపీ నాయకులు పేదలకు అండగా ఉండి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు నిర్మించారు. ఈ చరిత్ర ప్రజలకు తెలుసు.గతంలో బాలాజీ నగర్, జవహర్ నగర్ లలో కట్టుకున్న ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తే కాపాడుకునేలా బిజెపి పోరాటం చేసింది.పేదలకు జాగలు ఇచ్చి, ఇండ్లు కట్టించిన పార్టీ బిజెపి.ఇప్పుడు అవే ప్రాంతాల్లో మళ్లీ హైడ్రా పేరుతో కట్టుకున్న ఇండ్లను నేలమట్టం చేస్తుంటే, అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని బిజెపి పక్షాన బాధితులకు అండగా నిలిచాం.మూసీనది ప్రక్షాళన జరగాలంటే మూసీకి ఇరువైపులా 300 మీటర్లలో ఇండ్లన్నీ కూలగొట్టి భూములు గుంజుకొని మల్టీనేషనల్ కంపెనీలకు అప్పగించాల్సిన అవసరం లేదు.మూసీకి రెండు దిక్కులా ఇండ్లు కూల్చే సమయంలో బిజెపి ఎంపీగా పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడ్డం. బాధితుల నుంచి వందల కొలది దరఖాస్తులు వచ్చాయి. దీనిపై మల్కాజ్ గిరి కలెక్టర్ గారికి ప్రతినిత్యం ఫోన్ లో సంప్రదించి పరిష్కరించాలని కోరాం.నగరంలో గుండాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రభావం ఉంటుంది. రియల్టర్ల పేరిట భూముల ఆక్రమణలతో దౌర్జన్యం చేశారు. దీనిపై రాచకొండ సీపీ గారికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం చూపలేదు.భూ ఆక్రమణల విషయంలో పోలీసు అధికారులకు ఫోన్ చేసి వివరించినా, పై అధికారుల ఒత్తిళ్లతో చర్యలు తీసుకోలేదు.పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో.. బాధితులకు న్యాయం చేసేందుకు మేం అండగా నిలిచాం.మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ భూములు 1985లో ఆనాడు వివిధ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఈ భూములు కొనుక్కున్నారు.మేడ్చల్ లోని ఘట్ కేసర్ మండలం కొర్రెముల గ్రామంలో సర్వే నంబర్ 739 నుండి 749 వరకు 149 ఎకరాల భూమి ఉంది. 1985లో న ఏకశిల నగర్ కాలనీ పేరుతో గ్రామపంచాయితీ అనుమతితో 2086 ప్లాట్లను లే-అవుట్ చేశారు.ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు 2076 మంది 200 గజాల చొప్పున ప్లాట్లను కొనుగోలు చేశారు. 2005 లో ఓనర్లే 47.25 ఎకరాల భూమిని M.A. RAJU, A.venkatesh, A. Vijayabasker పేరుమీద సేల్ డీడ్ చేసారు.  1985లో ఈ ప్రాంతాల్లో జనవాసాలకు ఆస్కారం లేదు.1985-2005 వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. 2005 లో 47 ఎకరాల పైచిలుకు భూమిని M.A. RAJU, A.venkatesh, A. Vijayabasker పేరుమీద సేల్ డీడ్ చేసారు. 2006లో ఈ ముగ్గురు భూమిని కొన్నట్లుగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. పంచాయతీరాజ్ డీపీఓను మేనేజ్ చేసి అవి ప్లాట్లు కాదని అగ్రికల్చర్ ల్యాండ్ గా నమోదు చేయించారు.ఈ ప్రొసీడింగ్స్ కి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. దీనిపై 2009 లో కోర్టు అనుమతిస్తే 2010 లో  అది అగ్రికల్చర్ భూమి కాదంటూ బాజప్తా తీర్పునిచ్చింది.హర్ష కన్స్ట్రక్షన్ వారే ఈ లే-అవుట్ లో 206 ప్లాట్లు కొనుగోలు చేసారు. మళ్లీ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రెవెన్యూ అధికారుల ప్రోద్బలంతో 47 ఎకరాలకు మ్యుటేషన్ సంపాదించారు. 739 నుండి 749 సర్వే నంబర్లలో ఉన్న భూమి వ్యవసాయ భూమి కాదని రాజు, వెంకటేష్, విజయభాస్కర్ తప్పుడు పత్రాలు ఇచ్చారని తన ఆర్డర్లో స్పష్టం చేశారు.ఈ రికార్డులన్నీ ఇది వ్యవసాయ భూమి కాదని ప్లాట్లు అని తేల్చింది. అందుకు అనుగుణంగా అన్ని అనుమతులతో  700 మంది ఇళ్ళు కట్టుకున్నారు.వెంకటేశ్ అనే వ్యక్తి ఈ తతంగం వెనుక ఉండి నడిపించారని పంచయత్ సెక్రటరీ ఇచ్చిన రిపోర్ట్ చెప్తుంది..నిన్న మేము ఫీల్డ్ కి వెళ్లినప్పుడు కొంతమంది గూండాలు మాకు ఎదురుపడ్డారు.ఈ ప్రాంతంలో శ్రీనివాస్ అనే వ్యక్తి బ్యాంకులో లోన్ తీసుకుని రూ. 40 లక్షలతో ఇల్లు కట్టుకున్నాడు. అయితే, వాచ్ మెన్లు గా చెప్పుకుంటున్న 20-25 మంది గూండాలు కాళ్లావేల్ల మీద పడ్డా దౌర్జన్యంగా  ఆ ఇల్లును కూలగొట్టారు. ఆ తర్వాత కూడా రేకులషెడ్డును నిర్మించుకున్నా నేలమట్టం చేశారు.రజిత అనే మహిళ తన కుమారుడితో కలిసి ఇక్కడ జీవనం కొనసాగిస్తోంది. ఆ ప్లాట్ ను సాఫ్ చేసుకుంటున్న క్రమంలో గూండాలు వచ్చి దౌర్జన్యం చేశారు. రియల్టర్లు, గూండాల దౌర్జన్యం గురించి మహిళ మా దగ్గరకు వచ్చి మొర పెట్టుకున్నారు. దాంతో ఫీల్డ్ కి బాధితులతో కలిసి వెళ్లాం. ఆ గూండాలు కనీసం వెనక్కితగ్గకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు. అందుకే ఆ గూండాలపై నాలాంటి వారు చేయి ఎత్తాల్సి వచ్చింది.1980-1990 వరకు హైదరాబాద్ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో పేదలు తక్కువ ధరకు ఆ భూములు కొనుగోలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ భూముల ధరలు పెరగడంతో రియల్టర్లు ఆక్రమణలకు పాల్పడుతున్నారు.2007లో ఎల్ ఆర్ ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీం) చట్టం వచ్చింది. లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకునే యాక్ట్ ను తీసుకొచ్చారు.శంకర్ పల్లిలో వందల కోట్ల విలువైన 460 ఎకరాల భూమి ఉంది. ధరణి వచ్చిన తర్వాత ఈ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చివేసి ప్లాట్లు అన్నీ రద్దు చేసి, రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు చేసిన తప్పులకు ఆ కలెక్టర్ జైలుపాలయ్యారు.భూఅక్రమాల వెనుక దుర్మార్గులు ఎవరు? పేదల ఆస్తులకు రక్షణ ఎక్కుడుందో చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డికి ఉంది.గండిపేట మం. వట్టినాగులపల్లి వెయ్యి ఎకరాలు, షాద్ నగర్ లోని ఈదుల పల్లి, ఈర్లపల్లి, నాదర్ గుల్, బాలానగర్, గగన్ పహాడ్ వంటి అనేక ప్రాంతాల్లో భూ అక్రమాలు జరిగాయి.అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం. దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది.మొదటి నుంచి పేదలకు అండగా ఉండే పార్టీ బీజేపీ.ప్రభుత్వ పెద్దల అండతో హైదరాబాద్ లో లే-అవుట్లను కొల్లగొట్టిన ఘటనలపై కోర్టులు, హెచ్ఆర్సీ కి, లోకాయుక్త లాంటి సంస్థలకు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. న్యాయం చేయాలని కోరుతాం.  భూ అక్రమాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంగా పరిష్కరించి ఉంటే.. ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు. బాధితుల పక్షాన మాలాంటి వాళ్లు నిలబడి చేయెత్తే పరిస్థితి వచ్చేది కాదు.సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తమ్ముళ్లు హైదరాబాద్ చుట్టుపక్కల భూములను పంచుకుంటున్నారనే మచ్చ, అపనింద వస్తున్నది. దీనిపై ఎంక్వైరీ చేస్తే ఈ ఘటనల వెనుక ఎవరున్నారో బయటకు వస్తుంది.ఆనంద్ బాగ్ అనే ప్రాంతంలో 50 ఏళ్ల నుంచి నివసిస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన 200 ఎకరాల భూమిని 300 గూండాలు దానిని ఆక్రమించుకుని, ఇల్లును.. ప్రాపర్టీని నేలమట్టం చేశారు.దీనిపై సీపీ గారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పరిష్కరించలేదు. పోలీసులు బాసుల ఆదేశాలు పాటిస్తున్నారు తప్పితే బాధితులకు న్యాయం చేయడం లేదు.హైదరాబాద్ లో మొత్తం ఎన్ని లే-అవుట్ లు ఉన్నాయో ఈసీ సర్టిఫికెట్ ఉంటుంది. దాన్ని పరిశీలిస్తే భూములు వివరాలు స్పష్టంగా తెలుస్తాయి.కాళేశ్వరం మీద పెట్టిన డబ్బుల కంటే వందల రెట్లు సంపద భూ ఆక్రమణల ద్వారా నడుస్తోంది.బాజప్తా ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో ఇట్లాంటి ఘటనలపై చర్చలు జరిగాయి. ఇప్పుడు అదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పాత గ్రామపంచాయతీ లే-అవుట్లకు సంబంధించి నోటీసులిచ్చి అగ్రికల్చర్ ల్యాండ్లను రద్దు చేసి మళ్లీ ప్లాట్లన్నింటినీ రీస్టోర్ చేయాలని కోరుతున్నాం.గ్రామపంచాయతీల లే-అవుట్లకు ఎల్ఆర్ఎస్ స్కీం వచ్చినప్పటికీ ప్రభుత్వం దానిని సమర్థంగా, సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే భూ అక్రమాల ఘటనలు జరుగుతున్నాయి.ధరణి వచ్చిన తర్వాత భూముల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో లొసుగులతో పేదల భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి.వ్యవస్థ విఫలమైనప్పుడు బాధితుల తరఫున మేం కొర్రెముల గ్రామానికి వెళ్లి గూండాలను నిలువరించాల్సి వచ్చింది.కొర్రెముల గ్రామంలో ఇప్పటికే 60-70 శాతం ప్రజలు ఎల్ఆర్ఎస్ కట్టారు. ఖబడ్డార్.. గూండాల్లారా.. ప్రజలు వాళ్లకు సంబంధించిన జాగాల్లో ఇల్లు కట్టుకుంటే వాళ్లపై దౌర్జన్యం చేస్తే గూండాలు, భూ అక్రమార్కుల భరతం పడుతాం. చీల్చి చెండాడుతాం.మహిళలను, పేదవాళ్లను ఇబ్బందిపెట్టే అధికారం మీకు ఎక్కడిది..?లక్షల మంది పేద ప్రజలకు సంబంధించి ప్లాట్లు, భూములకు సంబంధించిన వ్యవహారం ఇది. పైసాపైసా కూడగట్టుకుని చిన్న ఉద్యోగులు, ప్రజలు కొనుగోలు చేసిన భూములను ఆక్రమించడం దుర్మార్గం.ఇప్పటికైనా పోలీసు అధికారులు బాసుల కోసం బానిసల్లా పనిచేయకూడదు. ఇలా వ్యవహరిస్తే ఎంతోమంది జైలుపాలయ్యారనేది గుర్తుపెట్టుకోవాలి.బాసుల ఆదేశాలే మీకు శిరోధార్యం కాదు.. పాటించాల్సింది చట్టాన్ని, న్యాయాన్ని. మాకు వ్యక్తుల పట్ల, వ్యవస్థల పట్ల ఎటువంటి ధ్వేషం లేదు.. దుర్మార్గాలు, అన్యాయం చేస్తున్నవారి పట్లే మా ధ్వేషం.కొర్రెంల ప్రజానీకాన్ని రెండుసార్లు కాపాడింది కోర్టు మాత్రమే. చట్టాల మీద సంపూర్ణ విశ్వాసం మాకుంది. పిడికెడు మంది చేస్తున్న వ్యవహారంతో వ్యవస్థనే తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.బాధితుల పక్షాన నిలిచిన మాపై కేసులు పెట్టడం కాదు.. 2005లో దొంగ డాక్యుమెంట్ల సృష్టికర్తలపై, దానికి సహకరించిన అధికారులు, భూములను అమ్ముకున్న ఓనర్లు, బ్రోకర్ల మీద కేసులు పెట్టాలి.పెద్దల అండతోనే అధికారులు ఎల్ఆర్ఎస్ ను పెండింగ్ పెట్టారు.భూ అక్రమాల దౌర్జన్యాలపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు, హెచ్ఆర్సీ, లోకాయుక్త వంటి సంస్థలకు ఫిర్యాదు చేస్తాం.మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చిన వాళ్లు, పేద ప్రజల రక్తం కళ్లజూనివారిపై ఖచ్చితంగా నాలాంటి కన్నెర్ర జేస్తారు. నాలాంటివాళ్లపై కేసులు పెడ్డారా..?తెలంగాణ ఉద్యమంలో నాపై 150 కేసులు ఉన్నాయి. ఇది మరో కేసు అవుతుంది. నా తెలంగాణ ప్రజల కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటా.రేవంత్ రెడ్డి కి హైదరాబాద్ చుట్టుపక్కల భూములు, రియల్టర్ల, బ్రోకర్లు… అన్నింటిపై నాకంటే ఎక్కువ అవగాహన ఉంది.అధికారం అండతోనే భూ ఆక్రమణలు జరుగుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్