జలదిగ్బంధంలో ఖమ్మం, మహబూబాబాద్

- Advertisement -

జలదిగ్బంధంలో ఖమ్మం, మహబూబాబాద్

Khammam, Mahbubabad in water blockade

హైదరాబాద్
భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై పడింది.ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వరద ప్రవాహానికి రైల్వే పట్టాలకింద కంకర కొట్టుకుపోయింది. ట్రాక్ దెబ్బతినడంతో ఆ రూట్ లో రైళ్ల ను నిలిపివేశారు.మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపివేసిన మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులకు స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు ఆహారపదార్ధాలు, నీరు అందించారు. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి.ఏపీ, తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ సికింద్రాబాద్ రైల్ నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు, పట్టాల మరమ్మతు, రైల్ సర్వీసుల పునరుద్ధరణపై చర్చించారు.అధికారులు విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లను పూర్తిగా రద్దుచేయడం లేదా దారి మళ్లించడం చేశారు.ఖమ్మం పట్టణాన్ని ఊహించని వరద చుట్టుముట్టింది. మున్నేరు నది ఉధృతంగా పారుతోంది. ప్రస్తుతం 27.5 అడుగుల ఎత్తులో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.పట్టణంలోని సగం కాలనీలు నీట మునిగాయి. ప్రకాశ్ నగర్ ప్రాంతం జలదిగ్బంధంలో ఉంది. ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై తొమ్మిది మంది ఉదయం నుండి చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు హెలికాప్టర్ ను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చీకటి పడటంలో బ్రిడ్జిపైన చిక్కుకున్న వారి భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.“ఖమ్మం పట్టణం గతంలో ఎన్నడూ చూడని వరద ఇది. సగం కాలనీలు మునిగిపోయాయి. నీరు చేరని ప్రదేశం అంటూ లేదు. పట్టణం నడిబొడ్డున 5 అడుగుల నీరు ప్రవహిస్తోంది. వరద అంచనా, సహాయక చర్యల్లో అధికారులు విఫలం అయ్యారు. జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్నా సమయానికి హెలికాప్టర్ను రప్పించలేకపోయారు.’’ అని తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని జర్నలిస్ట్ ఒకరు బీబీసీ తో చెప్పారు.“మున్నేరుకు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులు నత్తనడక కొనసాగుతున్నాయి. నాలాల కబ్జా, మున్నేరు వరద ఒత్తిడితో నీరు బయటికి పోవడం లేదు.’’ అని ఆయన అన్నారు.మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది.నెక్కొండ మండలం వెంకటాపురం సమీపంలో శనివారం రాత్రి నుండి 40 మంది ప్రయాణీకులతో ఉన్న ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుపోగా, ఆదివారం నాడు అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular