మీ సిద్దిపేటకు మెడికల్ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు ఎలా వస్తాయి మా నియోజకవర్గనికి ఎందుకు రావు, రావు గారు…
నీరటి రామ్ ప్రసాద్,NSF రాష్ట్ర అధ్యక్షులు
BRS రాష్ట్ర నాయకులు ట్రబుల్ షూటర్ హరీష్ రావు గారు ముందుగా ఖానాపూర్ నియోజకవర్గం గత 9సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేదా అనేది సమాధానం చెప్పి తరువాత తమ అభ్యర్థికి ఈ సారి ఓటు వేయమని అడగాలని “నవతరం స్టూడెంట్ ఫెడరేషన్(NSF)” రాష్ట్ర అధ్యక్షులు నీరటి రామ్ ప్రసాద్ అన్నారు, శుక్రవారం రోజున దీనికి సంబంధించిన పత్రిక ప్రకటనను రామ్ ప్రసాద్ జన్నారం లో విడుదల చేశారు, గత 9సంవత్సరాలుగా విద్యారంగాన్ని ఖానాపూర్ నియోజకవర్గంలో 1%కూడా అభివృద్ధి చెయ్యకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు, మీ నియోజకవర్గం అయిన సిద్దిపేటకు ఎట్లా మెడికల్ కాలేజీ వస్తది, ఇంజినీరింగ్ కాలేజీ వస్తది, మా నియోజకవర్గ పరిధిలో కనీసం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఎందుకు రావో “రావు” గారు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు, గత 9సంవత్సరలుగా మీకే నియోజకవర్గ ప్రజలు పట్టం కడితే అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు అభ్యర్థిని మర్చి అద్భుతాలు చేస్తాం అంటే ప్రజలు ఎలా నమ్మలని అన్నారు, మీకు గత 2 పర్యాయాలు నియోజకవర్గ స్థాయిలోను, మండల స్థాయిలో ఏ ఒక్క ప్రత్యేక కార్యక్రమాలు చెప్పట్టకుండా ఈరోజు మున్సిపాలిటీ లు చేస్తాం, ఇండ్లు ఇస్తాం అంటే ప్రజలు ఎలా నమ్మలని అన్నారు,ముందుగా హరీష్ రావు గారు ఎన్ని ఇండ్లు నియోజకవర్గంలో ఈ గడిచిన 9ఏండ్లలో ఇచ్చారో లెక్క ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు, అభివృద్ధి చేయకుండా ఈరోజు ఓట్లు అడగడం మీ అసమర్ధతకు నిదర్శనం అని అన్నారు.