- Advertisement -
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక మండలం భావదేవరపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన జాతీయ స్థాయి ఖోఖో క్రీడాకారిణి పూషడపు ప్రణవి (26) గుండెపోటుతో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు శోకసంధ్రంలో మునిగిపోయారు. పూషడపు సాంబశివరావు – శ్రీదేవి దంపతులకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. చిన్న కుమార్తె ప్రణవి హైదరాబాద్ టీసీఎస్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ జాతీయ స్థాయిలో ఖోఖో క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. శుక్రవారం హైదరాబాదులో ప్రణవి గుండెపోటుతో మృతి చెందగా, ఆమె పార్థివ దేహానికి స్వగ్రామం బావదేవరపల్లిలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.
- Advertisement -



