Wednesday, May 20, 2026

భార్యను చంపి… కుక్కర్ లో ఉడికించి… పొడి చేసి…

- Advertisement -

భార్యను చంపి… కుక్కర్ లో ఉడికించి… పొడి చేసి…

Killed the wife...cooked in a cooker...powdered it...

అనుమానమే… పెనుభూతమై
హైదరాబాద్, జనవరి 23, (వాయిస్ టుడే)
తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడికించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ లో ఈ దారుణం జరిగింది. ఈ నెల 18న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదని భర్త గురుమూర్తి…భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. భార్యాభర్తలు గురుమూర్తి, వెంకట మాధవి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్థలు ఉన్నాయని, తరచూ గొడవపడుతుండేవారని పోలీసులకు తెలిపింది. భార్యను చంపిన గురుమూర్తి.. ఆ తర్వాత తనకేం తెలియనట్టు వ్యవహరించాడు. ఎవరికీ అనుమానం రాకుండా అమాయక చక్రవర్తిలా నటించాడు. అయితే రోజులు గడిచినా మాధవి నుంచి ఎలాంటి ఫోన్‌కాల్ రాకపోవడంతో కన్నవాళ్లకు అనుమానం వచ్చింది. తమ బిడ్డ కనిపించడం లేదంటూ ఈనెల 13న మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారుదీంతో భర్త గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో గురుమూర్తి అసలు విషయం చెప్పాడు.తన భార్యను తానే హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకున్నాడు. భార్య మృతదేహాన్ని ముక్క ముక్కలుగా చేసి కుక్కర్ ఉడికించానని చెప్పాడు. అనంతరం ఆ ముక్కలను జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు చెప్పాడు. గురుమూర్తి చెప్పిన విషయాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైరైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. తూప్రాన్‌పేట్‌లోని దండుపల్లిలో గురుమూర్తి కుటుంబంతో నివశిస్తు్న్నాడు. వెంకట మాధవి మిస్సింగ్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి వృత్తి రీత్యా డీఆర్డ్జీవో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ.. జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవి(35)తో కలిసి జీవిస్తున్నాడు. వీరి సంసారంలో అనుమానం తలెత్తింది. దీంతో గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని అనుమానించేవాడు. ఈ విషయమై ఇరువురి మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగింది. దీంతో ఆగ్రహానికి లోనైనా గురుమూర్తి భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు. కమర్షియల్ సిలిండర్ తెచ్చి ముక్కలను ఉడకబెట్టాడు. అనంతరం కొన్ని ముక్కలను ఎండబెట్టి పొడిగా మార్చాడు. భార్యను చంపడానికి ముందు ట్రయల్ కోసం ఓ కుక్కను చంపి ముక్కలుగా నరికి ఉడకబెట్టాడు. ఇదే విషయాన్ని విచారణలో అంగీకరించాడన్నారు పోలీసులు.గురుమూర్తి శాడిజం కన్నబిడ్డలతో పాటు బంధువుల్ని నివ్వెరపోయేలా చేసింది. కేవలం అనుమానంతోనే భార్యను కడతేర్చాడా? ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? మర్డర్ ఎపిసోడ్‌లో గురుమూర్తికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారుమృతదేహం పొడిని బకెట్‌లో తీసుకువెళ్లి జిల్లెలగూడ చెరువులో కలిపేశాడు.వెంకట మాధవి మృతదేహానికి సంబంధించి ఆనవాళ్ల కోసం పోలీసులు చెరువులో గాలిస్తున్నారు. బుడిద కావడంతో ఎలాంటి ఆనవాళ్లు దొరకడంలేదని తెలుస్తోంది. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకంల రేపుతోంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్