ఎన్ఐఈఎల్ఐటి ను ప్రారంభించిన కేంద్ర మత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్
సికింద్రాబాద్లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటి) సెంటర్ ను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూనీలిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మన ప్రాంతంలో ప్రారంభం కానుండటం.. ఈ విద్యాసంవత్సరం నుంచే శిక్షణాతరగతులు ప్రారంభం కానుండటం.. చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం నడుస్తోంది. ఇందులో.. భారతదేశం రానున్న రోజుల్లో పూర్తిగా తన పట్టును పెంచుకుంటోందని అన్నారు. మన తెలుగు యువత అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగంలో సత్తాచాటుతున్నారు. ఇవాళ అంతర్జాతీయంగా ఏ పెద్ద కంపెనీ సీఈవో అయినా.. మనదేశానికి చెందినవారో.. మన భారత సంతతికి చెందినవారే ఉంటున్నారు. ఈ రంగంలో మరింత ముందడుగు వేసేందుకు.. ప్రపంచ స్థాయిలో.. మన యువతను తీర్చదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకెళ్లేందుకు.. అవసరమైన రీతిలో యువతకు శిక్షణ, నైపుణ్యత అందించే లక్ష్యంతో.. నీలిట్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నాం.
సికింద్రాబాద్, తిరుపతిల్లో ఎన్ఐఈఎల్ఐటి సెంటర్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం లభించిన నెల రోజులలోపే ప్రారంభించుకుంటుండటం.. యువత సాధికారత దిశగా మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఒక నిదర్శనమని అన్నారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ నీలిట్ సంస్థ.. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర అనుబంధ కోర్సులలో మెరుగైన శిక్షణను అందిస్తుంది. ఆయా రంగాలలో ఉపాధిని అన్వేషించే విద్యార్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందించి ఆయా కంపెనీలకు కావలసిన మానవ వనరులను అందుబాటులో ఉంచటంలో ఎన్ఐఈఎల్ఐటి కీలకపాత్రను పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, TASK, CEO, శ్రీ శ్రీకాంత్ సిన్హా, నీలిట్ చెన్నై డైరెక్టర్ శ్రీ కేఎస్ లాల్మోహన్ తోపాటుగా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎన్ఐఈఎల్ఐటి ను ప్రారంభించిన కేంద్ర మత్రి కిషన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -