Breaking News
Saturday, July 27, 2024
Breaking News

కె ఎల్ ఐ కాలువలు లేక రైతన్నలు విలవిల…

- Advertisement -

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసింది ఏమీలేదు
కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించండి
డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

నాగర్ కర్నూల్:  లింగాల మండలం మనాజిపెట్ గ్రామం లో బి ఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు, శుక్రవారం ముమ్మరంగా జరిగాయి.అదే విధంగా.వల్లభాపుర్, రాంపూర్, గ్రామ ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కు భారీగా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు.మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.మాకు కావాలి మా మేలు కోరే మా స్థానిక నాయకుడు, మాకు ఒద్దు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మభ్యపెట్టి కొట్టే, తిట్టే బెదిరించే వలస వాది.గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, యువకులు పార్టీకి రాజీనామ ,స్థానిక అసెంబ్లీ అభ్యర్థి డా. వంశీకృష్ణ  పార్టీ కండువాలు కప్పుతు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరంగా చేపట్టారు. అందులో భాగంగా అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గోని ఇంటి ఇంటి ప్రచారం ముమ్మరంగా చేపట్టారు. అనంతరం మేనిఫెస్టో ప్రకారం అధికారం లోకి వచ్చిన వెంటనే పేదల ను ఆదుకుంటామని , కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆభివృది అని గుర్తు చేశారు. నియోజక వర్గంలో బలమూర్, లింగాల మండలలలో కే ఎల్ ఐ కాల్వలు లేక రైతన్నలు విలవిల లాడుతున్న రని, బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేసిందని వారు ఆరోపించారు.
కాంగ్రెస్ 6 గ్యారంటీలు,మహాలక్ష్మి,.రైతు భరోసా.గృహా జ్యోతి.ఇందిరమ్మ ఇండ్లు.యువ వికాసం .చేయూత,తెలియజేస్తున్నా.స్థానిక అసెంబ్లీ అభ్యర్థి డా. వంశీకృష్ణ కు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. రాంపూర్ బొడ్రాయి, ఆంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రచారం లో మైపల్ రెడ్డి, డిసిసి వైస్ ప్రెసిడెంట్ అడ్వకేట్ కొయాల శ్రీనివాస్, వైస్ ఎంపిపి నారాయణ గౌడ్, మాజీ సింగల్ విండో చైర్మన్  కొండలరావు, వల్లభాపుర్ సర్పంచ్ స్వామి, మాజీ వైస్ ఎంపిపి కిషన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భాగ్య భాయ్, ఇందిరమ్మ, తిరుపతయ్య, జనార్దన్, రాంపూర్ సత్యనారాయణ,హన్మంతు, జంగయ్, కుర్మయ్, విష్ణు, యువజన కాంగ్రెస్ నాయకులు శివ, లక్ష్మణ్ నాయక్, ధర్మా రెడ్డి,తది తరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!