హైదరాబాద్ అక్టోబర్ 27: మస్తు షేడ్స్ ఉన్నయ్ నీలో.. కమల్ హాసన్’ డైలాగ్ బాగా ఫేమస్… ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పొలిటికల్ సర్కిల్‌లో ఈ డైలాగ్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాడుతున్నారు. అంతేకాదు.. ఒక్క నెలలోనే బీజేపీకి ‘అపరిచితుడు’ సినిమా చూపించాడంటూ నేటిజన్స్ పేర్కొంటున్నారు. ఇందుకు ఈ నెలలో జరిగిన పరిణామాలే నిదర్శనమని అంటున్నారు.అక్టోబర్ 5 న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక పెద్ద లేఖను విడుదల చేశారు. ఇందులో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని విడిచిపెట్టేది లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. బీజేపీ ముఖ్య నేతలెవరూ పార్టీని వీడరంటూ అభయం ఇచ్చేశారు.అక్టోబర్6న బీజేపీ అధిష్టానం కోమటిరెడ్డికి స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చింది. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నెరవేర్చుతానని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ ఆ రోజు మీడియా ముఖంగా చెప్పారు.అదేరోజు బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు.అక్టోబర్ 16న చౌటుప్పల్‌లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఇన్ని చెప్పిన రాజగోపాల్ రెడ్డి గత వారం రోజులుగా తనలోని అపరిచితుడిని బయటికి తీశారు. క్రమంగా పార్టీకి దూరంగా ఉంటూ.. ఢిల్లీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. విమానం ఎక్కి ఢిల్లీకి వెళ్లి చర్చలు జరిపి వచ్చేశారు. ‘త్వరలో నిర్ణయం తీసుకుంటా’ అంటూ దసరానాడు బాంబు పేల్చాడు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు రెండు రోజుల కిందట ప్రకటించారు. ఈ పరిణామాలు చూసిన రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. రాజగోపాల్‌రెడ్డి స్థాయి ఉన్న నేతలు సాధారణంగా పార్టీ మారే నిర్ణయంపై కనీసం నెలరోజులపాటు చర్చ లు జరుపుతారని చెప్తున్నారు. అంటే.. అక్టోబర్ దలయ్యేనాటికే ఆయన పార్టీ మారాలని ఫిక్స్ అయ్యారంటున్నారు. అయినా పైకి కనిపించకుండా ఏకంగా రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొని, పార్టీ కార్యాలయాలను ప్రారంభించడం వంటివన్నీ చూస్తుంటే బీజేపీకి ‘అక్టోబర్‌లో అపరిచితుడు’ అనే సినిమా చూపించారంటూ ఎగతాళి చేస్తున్నారు.
ఒక్క నెలలోనే బీజేపీకి ‘అపరిచితుడు’ సినిమా చూపించిన కోమటిరెడ్డి
Published By Voice Today Team
186
- Advertisement -
- Advertisement -
- Tags
- congress
- exclusive interview
- funny videos
- komatireddy
- komatireddy new song
- komatireddy raj gopal reddy
- komatireddy raj gopal reddy news
- komatireddy rajagopal reddy
- komatireddy rajagopal reddy joins congress
- komatireddy rajagopal reddy latest news
- komatireddy rajagopal reddy news
- komatireddy rajgopal reddy
- komatireddy songs
- komatireddy venkat reddy
- komatireddy venkat reddy speech
- mallanna counter encounter
- mallanna news
- mass mallanna
- mla komatireddy rajagopal reddy
- morning news with mallanna 14-02-2022
- mp komatireddy venkat reddy
- mp komatireddy venkat reddy songs
- munugodu bjp party
- munugodu congress party
- munugodu elections
- munugodu nominations
- munugodu nominations troll
- munugodu trs party
- Narendra Modi
- ntv news online
- ntv youtube
- point blank
- q news interview
- q news mallanna counter encounter
- q news mallanna today
- rapid fire interview
- today morning news mallanna
- trending



