- Advertisement -
కోనసీమ కేంద్రంగా టూరిజమ్ అభివృద్ది
Konaseema as a center for tourism development
అమలాపురం
అభివృద్ధి అంటే అమలాపురం.. అమలాపురం అంటే ఆనందరావు అనేలా అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తానని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణలో రోడ్లు విస్తరణ చేయడానికి 65 కోట్లు జిల్లా ఇంచార్జ్ మంత్రి అచ్చం నాయుడు ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో అమలాపురం పట్టణం అభివృద్ధి చేయడానికి రోడ్లు విస్తరణ అలాగే ట్రాఫిక్ సమస్యను తొలగించేందుకు బ్రిడ్జిల నిర్మాణాల కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. జిల్లా నియోజకవర్గ జిల్లా కేంద్రమైన అమలాపురం రాజమండ్రి, కాకినాడ కంటే వెనుకబడి ఉందని నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రం అయిన అమలాపురాన్ని అభివృద్ధి చేయడానికి రేయింబవళ్లు కష్టపడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు ఎమ్మెల్యే ఆనందరావు. అమలాపురం నియోజకవర్గం లో ఉన్న 25 కిలోమీటర్ల సముద్ర తీరం ఎస్ యానం బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. కోనసీమ కేంద్రంగా టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికల రూపొందించామని తెలిపారు ఎమ్మెల్యే ఆనందరావు. నూతనంగా ఎన్నికైన అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమితులైన అల్లాడి సోంబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 18వ తేదీన అమలాపురంలో జరుగుతుందని ఈ ప్రమాణ స్వీకారానికి జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చం నాయుడు, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ హాజరవుతారని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు…
- Advertisement -